తక్కువ టైమ్ లోనే ఫేమస్ అయిన హీరోయిన్స్.. మరి అంతలోనే..!!

సినీ ఇండస్ట్రీలో హీరోలకు తప్ప హీరోయిన్లకు ఎక్కువ లైఫ్ టైం ఉండదని చెప్పవచ్చు. చాలావరకు హీరోలు ఒక సినిమా సక్సెస్ అయితే చాలు ఎలాగోలాగా తమ కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లు మాత్రం 6,7 ఏళ్ల కంటే ఎక్కువగా రాణించడం కష్టమని చెప్పవచ్చు. కొంతమంది హీరోయిన్లు సక్సెస్ బాగానే వచ్చిన ఫేడవుట్ అవుతూ ఉంటారు. టాలీవుడ్ లోకి ఎంట్రి చేసిన కొంతమంది హీరోయిన్లు మొదట బాగానే సక్సెస్ అయిన ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. వారి గురించి తెలుసుకుందాం.

Neha Shetty movies, filmography, biography and songs - Cinestaan.com
ప్రస్తుతం హీరోయిన్లలో సమంత, త్రిష, పూజా హెగ్డే, కీర్తి సురేష్, తమన్నా తదితర హీరోయిన్ల సైతం ఇప్పటివరకు పలు అవకాశాలను దక్కించుకుంటూ ఉన్నారు. ఇక తమ ఉనికిని చాటుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది పుంజుకోవడం జరుగుతూ ఉంది. అయితే కేవలం ఒకే ఒక్క సినిమాతో వండర్ అనిపించుకున్న హీరోయిన్లు మాత్రం వెంటనే ఫేడవుట్ అయిపోతూ ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతోంది. చివరిగా తన నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఫేమ్ ను కోల్పోయింది.

Krithi Shetty Faced Problems in Comprehending N. Linguswamy's Telugu But...

డిజె టిల్లు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేహా శెట్టి కూడా ఈ కోవకు చెందినది. వీరి తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమతో తిరుగులేని స్టార్ డం సంపాదించుకున్న నభా నటేష కూడా సినిమా అవకాశాల కోసం పలు పాట్లు పడుతోందని చెప్పవచ్చు. ఇక వేరే కాకుండా కేతిక శర్మ, ఆవికా గౌర్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. సీనియర్ హీరోయిన్లలో ఇప్పటికే చాలామందికి అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈ యువ హీరోయిన్లకు మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాక ఫీడవుట్ ఉన్నారు.