హీరో విశాల్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!!

టాలీవుడ్ లో హీరో విశాల్ అటు సినిమాలలో, పాలిటిక్స్ లోనే కాకుండా నిత్యం పెళ్లి వార్తలలో కూడా వైరల్ గా మారుతూ ఉంటారు. కోలీవుడ్లో యాక్షన్ హీరోగా పేరు పొందిన విశాల్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో సరికొత్త కధలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముందు నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ వ్యవహారం అంటూ చాలా వార్తలు వినిపించాయి. పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ నిజం కాదని తెలియజేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కి చెందిన యువతి తో విశాల్ నిశ్చితార్థం కూడా జరిగింది.

Vishal Abhinaya : ఆమెతో ప్రేమలో పడిన నటుడు విశాల్.. త్వరలోనే పెళ్లి -  Actress Abhinaya Condemns Marriage Rumors With Hero Vishal,Hero Vishal, Abhinaya,Varalakshmi Sarath Kumar, Nadodigal Movie,Vishal Marriage ...

కానీ కొన్ని కారణాల చేత ఆ యువతీ తో వివాహం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు విశాల్ పైన పలు పుకారులు వినిపించాయి. తాజాగా త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ విశాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో రవితేజ, అల్లరి నరేష్ తదితర హీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమెకు వినికిడి , సమస్యతో పాటు మాటలు రాని లోపాలతో ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది. అలాగే నేనింతే,డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర సినిమాలలో గుర్తుండిపోయే నటనను ప్రదర్శించింది.

ప్రస్తుతం విశాల్ తో హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోని చిత్రంలో ఈమె లీడ్ రోల్లో నటిస్తున్నది. ఈ నేపథ్యంలో విశాల్ తో ప్రేమ పెళ్లి వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఈ ప్రచారంపై విశాల్ ఇప్పటివరకు స్పందించలేదు.. నటి అభినయ మాత్రం రియాక్ట్ అవుతూ మార్క్ ఆంటోని సినిమాలో కేవలం విశాల్ కు భార్యగా నటిస్తున్నాను రిల్ లైఫ్ లో భార్యగా నటిస్తే.. రియల్ లైఫ్ లో భార్య కాగలమా? అంటూ ఈ పుకార్లపైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ విషయం కి పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)