వైసీపీలో నాలుగు సర్వేలు..బయటపడ్డ రిపోర్ట్..!

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేస్తున్న విషయం తెలిసిందే..మళ్ళీ అధికారం దక్కించుకోవాలని..ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ..ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది. ఈ రెండు పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం దూకుడుగా ముందుకెళుతున్నాయి. ఎక్కడకక్కడ తమ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఇదే క్రమంలో తమ పార్టీల గెలుపోటములకు సంబంధించి..ఎవరికి వారు అంతర్గంగా సర్వేలు చేయించుకుంటున్నారు. థర్డ్ పార్టీ సర్వేలే కాకుండా…వైసీపీ-టీడీపీలు సెపరేట్‌గా సొంత సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. వైసీపీకి సంబంధించిన నాలుగు సర్వే రిపోర్టులు జగన్ వద్దకు చేరుకున్నాయని తెలిసింది. ప్రభుత్వ ఇంటిలిజెన్స్ సర్వే, ఐప్యాక్ టీం సర్వే, అలాగే పార్టీలోని ఇద్దరు బడా నేతలు కూడా సర్వేలు చేయించారట. ఆ సర్వే రిపోర్టులు ఇప్పుడు జగన్ వద్దకు చేరుకున్నాయని సమాచారం.

అయితే ఓవరాల్‌గా సర్వే రిపోర్ట్ వచ్చి నెక్ టూ నెక్ అన్నట్లు ఫైట్ ఉందని బయటకొచ్చింది. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం..వైసీపీ 61 సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ 42 సీట్లు గెలుచుకుంటుందని తేలిందట. అలాగే జనసేనకు 3 సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయట. అంటే ఇవి ఖచ్చితంగా గెలిచే సీట్లు. అంటే 106 సీట్లు డిసైడ్ అయ్యాయి. అయితే టీడీపీ-జనసేన పొత్తు మీద ఆధారపడి 25 సీట్లు ఉన్నాయట. పొత్తు ఉంటే ఆ 25 సీట్లు ఆ రెండు పార్టీలే గెలుచుకుంటాయట. లేదంటే 25 సీట్లలో వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని తేలింది. ఇక్కడకి 131 సీట్లు..ఇక 44 సీట్లలో వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ ఉందని తేలింది. అంటే టీడీపీ-జనసేన పొత్తు లేకపోతే వైసీపీ ఈజీగా గెలిచి మళ్ళీ అధికారం దక్కించుకోవచ్చు..పొత్తు ఉంటే మాత్రం కష్టమని వైసీపీ అంతర్గత సర్వేల్లో తేలిందని తెలుస్తోంది.