బాబుకు రెండు సీట్లు ఫిక్స్ చేసిన వైసీపీ.!

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గంని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ఆయన కేవలం కుప్పంపై ఫోకస్ పెట్టి..అక్కడ టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో కుప్పంలో వైసీపీ బలం పెంచడంలో సక్సెస్ అయ్యారు. పంచాయితీ, పరిషత్, కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది..ఇలా కుప్పంలో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. దీంతో చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యి…కుప్పంలో పార్టీ పరిస్తితిని చక్కదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. అటు బాబుకు వైసీపీ చెక్ పెట్టేలా ముందుకెళుతుంది. ఈ మధ్య కుప్పంలో చంద్రబాబు, జగన్ పర్యటనలు కాక రేపిన విషయం తెలిసిందే. అయితే కుప్పంలో బాబుని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది.

ఈ క్రమంలోనే కుప్పంలో బాబు ఓటమి ఖాయమని, అలాగే ఆయన కుప్పం సీటు వదిలేసి వెళ్లిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. అంటే బాబు పని అయిపోయిందనే విధంగా వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. అలాగే బాబు ఈ సారి రెండు సీట్లలో పోటీ చేయబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికలో కూడా బాబు కుప్పంతో పాటు మరో సీటులో పోటీ చేయబోతున్నారని కథనం వచ్చింది.

ఈ కథనాన్ని విజయసాయిరెడ్డి ట్వీట్ చేసి.. ఇంగ్లీష్ మీడియా తాజా కథనాన్ని ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఇందులో ఎలాంటి తప్పూ లేదని, గతంలో చాలా మంది రెండో సీట్లో పోటీ చేశారని, ఎన్నికల సంఘం కూడా దీనికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదంటూ సెటైర్లు వేశారు. గతంలో ఎన్టీఆర్ కూడా రెండు చోట్ల పోటీ చేశారని, 2019లో రాహుల్ గాంధీ కూడా రెండు చోట్ల పోటీ చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో వైసీపీ ప్రచారమే తప్ప..నిజం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి..బాబు కుప్పంలోనే పోటీ చేస్తారని, రెండుచోట్ల పోటీ చేసే ప్రసక్తి లేదని, ఇదంతా వైసీపీ గేమ్ ప్లాన్‌లో భాగంగా జరుగుతుందని అంటున్నారు. ఏదేమైనా కుప్పంలో పోటీ చేసి బాబు భారీ మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నారు.