చిరంజీవిని వాళ్ళు కాపీ చేశారా… లేదంటే చిరు వాళ్లని కాపీ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆయన చూసినన్ని సూపర్ హిట్స్ ఇండియాలో మరెవ్వరు చూసి ఉండరేమో. అలాంటి మెగాస్టార్ అద్భుతమైన నటనతో ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా కుర్ర హీరో మాదిరిగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు కష్టపడుతున్న ఈ సమయంలో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఘనత కేవలం చిరంజీవికి మాత్రమే దక్కింది. అంతటి ఘనత చాటుకున్న చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఒక సినిమా ఫ్లాప్ అయిన సమయంలో హీరో అయినా ఇతర యూనిట్ సభ్యులు అయినా హుందాగా వ్యవహరించాలి.. మాట్లాడాలి. ఆచార్య సినిమా ఫెయిల్యూర్ కి కారణం ఎవరైనా అయ్యి ఉండవచ్చు.. కానీ మెగాస్టార్ చిరంజీవి వంటి గొప్ప నటుడు ఫెయిల్యూర్ ను స్వీకరించి మౌనంగా ఉండి తదుపరి సినిమాతో హిట్ కొట్టి ఆ ఫెయిల్యూర్ కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆచార్య ఫ్లాప్ కి దర్శకుడు కారణం అన్నట్లుగా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయడంను చాలా మంది తప్పుబడుతున్నారు.

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఇతర హీరోలు గతంలో మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ షేర్ చేసి చిరంజీవిని ఇదే అదును అన్నట్లుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. గతంలో మహేష్ బాబు మాట్లాడుతూ సినిమా సక్సెస్ ఫ్లాప్ అనేది నా బాధ్యత.. నేను సినిమా కథను నమ్మి చేశాను.. కనుక అది నా వల్లే జరిగిందని నేను భావిస్తును. కనుక కథ విషయంలో సరైన జడ్జ్ మెంట్ తీసుకుని ఉంటే మంచి ఫలితం వచ్చేది అన్నట్లుగా మహేష్ బాబు మాట్లాడిన మాటలను ఇప్పుడు కొందరు షేర్ చేస్తున్నారు.