సీనియర్ రాజకీయ నాయకుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత..!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌(82) కొద్దిసేపటి క్రితమే ఆయన కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయం ఉంచటంతో ఈరోజు ఉదయం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ చేయగా అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణించారన్న విషయాన్ని ఆయన కుమారుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఆగస్టు 22 నుంచి ములాయం ఆస్పత్రిలోనే ఉన్నారు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలోకి తరలించారు. అప్పటినుంచి ఆయన ఆక్సిజన్ ద్వారానే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు.

Concerned about the health of Mulayam Singh Yadav supporters cried in hospital said will give life for Netaji | Mulayam Singh Yadav के स्वास्थ्य को लेकर चिंतित समर्थक अस्पताल में फूट-फूट कर

ములాయం సింగ్‌ 1939 నవంబర్ 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఆయన జన్మించాడు. ఆయనకు చిన్నప్పటినుండి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ.. ఈ క్రమంలోనే 1967లో మొదటిసారి యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈయన ఇంద్ర గాంధి హ‌యంలో కొన్ని సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నారు. 1989 లో ఉత్తరప్రదేశ్ కి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1992లో సమాజ్వాది పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని పెట్టారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పటికి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు… 7సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన మూడుసార్లు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.