సీనియర్ రాజకీయ నాయకుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత..!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌(82) కొద్దిసేపటి క్రితమే ఆయన కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయం ఉంచటంతో ఈరోజు ఉదయం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ చేయగా అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణించారన్న విషయాన్ని ఆయన కుమారుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఆగస్టు 22 నుంచి […]

ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో మ‌రో ట్విస్ట్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. ఒక్క‌సారిగా యూపీలో బీజేపీ జెండా రెప‌రెప‌లాడిన ద‌గ్గ‌ర నుంచి..ఎన్నో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. బ‌ద్ధ శ‌త్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్‌, ప్ర‌ధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజుల‌కే ములాయం చిన్న కొడుకు, కోడ‌లు పార్టీని వీడ‌తార‌నే ప్ర‌చారం అక్క‌డి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని, ఈ మేర‌కు బీజేపీ […]

ములాయం – అఖిలేష్ మ‌ధ్య వియ్యంకుడి రాజీ

ఎన్నిక‌లు ముంచుకొచ్చిన వేళ‌.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అధికార పార్టీ ఎస్పీలో నెల‌కొన్న ముస‌లానికి పార్టీ చీఫ్ ములాయం సింగ్ ఉర‌ఫ్ నేతాజీ ముగింపు ప‌ల‌కాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. త‌న పెద్ద కొడుకు.. యూపీ సీఎం అఖిలేష్‌ను మొండివాడిగా పేర్కొంటూ.. తాను ఓ ప‌రిష్కారానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి గ‌డిచిన ఆరు నెలలుగా ఎస్పీ అధికార పార్టీలో పెద్ద ఎత్తున ఆధిప‌త్య పోరు పెరిగింది. మంత్రిగా ఉన్న సొంత బాబాయి శివ‌పాల్ యాద‌వ్‌ను తొల‌గిస్తూ.. అఖిలేష్‌ తీసుకున్న‌ నిర్ణ‌యం […]

యూపీలో తండ్రి, కొడుకులు విడిగా పోటీ చేస్తే…రిజల్ట్ ఇదే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ చీఫ్ నసీమ్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం యూపీ – ఉత్త‌రాఖండ్ – గోవా -మ‌ణిపూర్‌- పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ఇప్పుడు అంద‌రి దృష్టి దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే ఉంది. ఎన్నిక‌ల వేళ యూపీలో రాజ‌కీయ ప‌రిణామాలు స‌డెన్‌గా మారిపోయాయి. సీఎం అఖిలేశ్‌, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేశ్ తండ్రి ములాయం మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎస్పీ […]

ములాయం మ‌హాకూట‌మిపై మ‌ళ్లీ లుక‌లుక‌లు

యూపీ అధికార పార్టీ ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్ర‌ధాని కావాల‌నే ముచ్చ‌ట ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, వ‌చ్చే 2017 రాష్ట్ర ఎన్నిక‌ల్లో తిరిగి ఎస్పీని అధికారంలోకి తీసుకురావాల‌న్న ఆయ‌న ఆశ‌ల‌పై నా నీళ్లు జ‌ల్లుతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఈ రెండు విష‌యాల్లోనూ ఆయ‌న క్లారిటీగానే ఉన్నా.. ఆయ‌న భాగ‌స్వామ్య పార్టీలు మాత్రం ములాయం కాళ్ల‌కు బంధాలేస్తున్నాయి. దీంతో నేతాజీ చిక్కుల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్నారు. వాస్త‌వానికి ఎస్పీ విష‌యంలో ములాయం మాటే వేదం! అయితే, […]

సీఎంకు మారుత‌ల్లి చేత‌బ‌డి చేయించిందా?

ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో రాజ‌కీయ పీఠాల కోసం మారు త‌ల్లులు విష ప్రయోగం చేయ‌డం, మందు మాకులు పెట్ట‌డం, మంత్ర గాళ్ల‌ను ఆశ్ర‌యించ‌డం వంటివి చూశాం. ఇప్పుడు ఈ సీన్ యూపీలో రిపీట్ అయింద‌ని అంటున్నారు అక్క‌డి సీఎం అఖిలేష్ వ‌ర్గానికి చెందిన నేత‌లు. త‌మ నేత, యూపీ సీఎం అఖిలేష్ పై క‌త్తిక‌ట్టిన మారుత‌ల్లి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ రెండో భార్య అఖిలేష్‌పై చేత‌బ‌డి చేయింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం […]