ఆ కమెడియన్ కి ఇద్దరు పోలీసులను రక్షణగా ఉంచిన ముఖ్యమంత్రి.. కారణం..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటితో పోల్చుకుంటే అప్పట్లో హాస్యనటులకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఎందుకంటే ఒకరు ఇద్దరు మాత్రమే హాస్యాన్ని పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతేకాదు తమిళ్ ప్రేక్షకులను కూడా మెప్పించేవారు. అంతేకాదు అప్పుడప్పుడు ఈ కమెడియన్ల డిమాండ్లకు ముఖ్యమంత్రులు సైతం దిగివచ్చారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఇక అలాంటి ఒక కమెడియన్ కోసం ఇద్దరు పోలీసులను రక్షణగా కూడా ఉంచారు తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Raja Babu Funny Scene - Comedy Kings - Kaikala Satyanarayana, Raja Babu -  YouTube
ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, కృష్ణ , శోభన్ బాబు లాంటి అగ్ర హీరోల సినిమాలలో ప్రథమంగా కనిపించే ఏకైక హాస్యనటుడు రాజబాబు.. ఇక ఈయన నటించని ఏ సినిమా అయినా సరే పెద్దగా విజయం సాధించదు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక అలా అందరికీ ఒకే కమెడియన్ కావడంతో ప్రతిరోజు 20 గంటల పాటు షూటింగ్లో పాల్గొనడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫుల్లుగా తాగి నాలుగు గంటల పాటు నిద్రపోవడం ..మరి ఉదయాన్నే లేచి షూటింగ్లకు వెళ్లడం ఇది ఆయన దినచర్య. అయితే ఎప్పటిలాగే ఒకరోజు ఫుల్లుగా తాగేసి కారును వేగంగా నడపడంతో పోలీసులు అడ్డుకొని ఆయనను అవమానించారు.

ఆయనను అలా అవమానించడానికి కూడా కారణం లేకపోలేదు ..ఎందుకంటే ప్రముఖ హీరోగా తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంజీఆర్ అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన మద్యం నిషేధం విధించారు. అలాంటి సమయంలో రాజబాబు ఫుల్లుగా మందు తాగి రోడ్డుపై కారు నడుపుతుంటే పోలీసులు ఆయనను పట్టుకొని మరీ అవమానించారట. దీంతో కోపంతో ఊగిపోయిన రాజబాబు ఏకంగా ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ ఇంటికి వెళ్లి పోలీసులు నన్ను అవమానిస్తారా అంటూ గట్టిగా నిలదీశారట .అంతే కాదు ఎంజీఆర్ కే సవాల్ విసిరారట రాజబాబు.

Tamil industry to celebrate MGR's 100th birthday throughout the year -  Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at  Bollywoodlife.com
ఇక ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీఆర్ రాజబాబు కోసం దిగివచ్చి రాజబాబును అవమానించిన పోలీసులను పిలిపించి ఆయనకు క్షమాపణలు చెప్పించడమే కాకుండా ఆయన తాగినా ఆపవద్దని కూడా సూచించారట. అంతేకాదు ఆయనకు రక్షణగా ఇద్దరు పోలీసులను కూడా నియమించారట ఎంజీఆర్. ఇక అలా రాజబాబు కోసం ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ ఇద్దరు పోలీసులను రక్షణగా ఉంచారు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది.