మెకానిక్ నుంచి హీరోగా ఎదిగిన శ్రీహరి జీవిత కథ ఇదే..!!

తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటుల వ్యక్తిత్వం గురించి ప్రేక్షకులు పలు రకాలుగా ఇన్స్పైర్ తీసుకొని చేస్తూ ఉంటారు.మరి కొంతమంది నటనపరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ లో రియల్ స్టార్ గా పేరుపొందిన శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఒక సైకిల్ మెకానిక్ లో పనిచేస్తు ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. తన కుటుంబం తో పాటు ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నాడట. టాలీవుడ్ లో వన్ మ్యాన్ ది పర్ఫెక్ట్ యాక్టర్ అంటే శ్రీహరినే అని చెప్పవచ్చు.

Srihari: A master of character roles

తను ఎలాంటి పాత్రలోనైనా జీవించి నటించగలడు. అంతేకాకుండా తన ఇంటికి ఎవరు వచ్చినా డబ్బు సహాయం లేదా అన్నం పెట్టి మరి పంపేవారట. శ్రీ హరి కృష్ణ జిల్లాలలోని గుడివాడ ఎలమర్రు ప్రాంతంలో పుట్టి పెరిగారు. మొదట సైకిల్ మెకానిక్ షాప్ లో సోడాలు అమ్ముకుంటూ తన జీవితాన్ని కొనసాగించేవారు. అయితే తన ఊర్లో తనకున్న పొలాన్ని అమ్మి హైదరాబాద్ కి వచ్చేసారట. అలా వచ్చిన తరువాత శోభన్ థియేటర్ ఎదురుగా ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తూ ఉండేవారు. అలా తన చదువుని కొనసాగిస్తూ పలు చిత్రాలు చూస్తూ శ్రీహరికి నటన పైన ఆసక్తి పెంచుకున్నారట.

Docs bungled Srihari's case: Wife
అయితే శ్రీహరి తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వ్యాయామం, జిమ్ వంటివి మాత్రం వదిలిపెట్టలేదట యుక్త వయసు వచ్చేసరికి శ్రీహరి ఎన్నో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో కూడా విజేతగా నిలిచారు. మరొకవైపు డిగ్రీ పూర్తి చేయడమే కాకుండా సినిమాలు మీద ఇంట్రెస్ట్ తో రైల్వే, పోలీస్ శాఖలో ఉద్యోగాలను కూడా రిజెక్ట్ చేశారట. ఇక తనకి జిమ్ స్టిక్ బాగా తెలియడంతో స్టంట్ ఫైటర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టారు. అలా 1987లో దాసరి నారాయణరావు తెరకెక్కించిన బ్రహ్మనాయుడు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి తన అడుగును పెట్టాడు శ్రీహరి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా కామెడీ రోల్స్,తదితర చిత్రాలలో హీరోగా నటించి బాగా పేరు సంపాదించారు. అయితే చివరికి 2013లో తృది శ్వాస విడిచారు శ్రీహరి.