ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. అందుకే స్నానానికి దూరం..!!

మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే భరించలేము..కానీ ఎన్నో సంవత్సరాలుగా స్నానం చేయని కారణంగా ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరుపొందాడు ఇరాన్ వ్యక్తి అమౌ హజి. తాజాగా ఈ వ్యక్తి కన్నుమూయడం జరిగింది.ఈయన ప్రస్తుత వయసు 94 సంవత్సరాలు. ఆదివారం డేజ్ గా గ్రామంలో మరణించినట్లు న్యూయార్ పోర్ట్ ప్రభుత్వం మీడియాకు నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం.అమౌ హజి నీటికీ భయపడి దాదాపుగా 60 ఏళ్లుగా స్నానం చేయలేదు. అక్టోబర్ 23న ఇరాన్లోని దక్షిణాది ప్రావిన్స్ ఫార్మ్స్ లో అనే గ్రామంలో తుది శ్వాస విడిచినట్లు పలు మీడియా సంస్థలు కూడా తెలియజేశాయి.

Amou Haji, Known as 'World's Dirtiest Man,' Dead at 94
అమౌ హజి ఒంటరిగా నివసిస్తూ ఉండేవారట.స్నానం చేస్తే అనారోగ్యానికి గురవుతానని భయంతో తను చనిపోయే వరకు స్నానమే చేయలేదట. అయితే కొద్ది నెలల క్రితం అతడికి గ్రామస్తులు బలవంతంగా స్నానం చేయించారు.అమౌ హజి 2013లో ఒక డాక్యుమెంటరీ కూడా రావడం జరిగింది 60 ఏళ్లుగా స్నానానికి దూరమై మురికితో పూర్తిగా దుమ్ము కొట్టుకుపోయిన అమౌ హజి ఇటీవల గ్రామస్తులు కలిసి బలవంతంగా స్నానం చేయించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన మృతి చెందడం జరిగిందట.

Iranian man who didn't wash for half a century dies at 94 - BBC News

అమౌ హజి ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. అతను తన యవ్వనంలో కొన్ని భాగోద్వేగపరితమైన ఇబ్బందులను ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నాడట దీంతో అతడు నీరు లేదా సబ్బుతో స్నానం చేయకుండా నివసించడం అలవాటు చేసుకున్నారని టెహ్రాన్ టైమ్స్ లో ప్రచురించడం జరిగింది. అయితే ఒక నివేదికలో మాత్రం హాజీ మాంసం తింటాడని కేవలం జంతువుల విసర్జనతో నిండిన పైపుతో పొగ తాగుతాడని పరిశుభ్రత అతన్ని అనారోగ్యానికి గురి చేస్తుందని నమ్మేవారట. దీంతో అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. హాజీ మరణంతో జీవితకాలంలో అత్యధిక కాలం స్నానం చేయని వ్యక్తిగా రికార్డు ఉందని అనధికారంగా భారతీయులకు సొంతమైందని సమాచారం.