తెలుగులో తమ నటనతో మంచి పేరు తెచ్చుకున్న హీరోలు కొందరు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా నటించి తామేంటో నిరూపించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అలా అనుకున్న వారిలో అందరికీ బాలీవుడ్ కలిసి రాదు. ఇక్కడ తెలుగులో ఎంతో మంచి పేరు తెచ్చుకున్ని బాలీవుడ్ కి వెళితే అక్కడ వారి ఆశలన్నీ గల్లంతవుతాయి. కారణం వారి సినిమాల సెలెక్ట్ చేసుకునే విధానం… ఏ ఇండస్ట్రీ అయినా మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే ఎలాంటి నటులకైనా మంచి గుర్తింపు వస్తుంది. స్టార్ క్యాస్ట్ ఉన్నారని కథలేని సినిమాలు నటిస్తే ఎవరికైనా గుర్తింపు రాదు.
ఇప్పుడు ఈ విషయమే టాలీవుడ్ లో ఉన్న ఓ ముగ్గురు హీరోల విషయంలో నిజమైంది. ముగ్గురు హీరోలు కూడా టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఈ పేరుతో బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించారు. వారు నటించిన మొదటి సినిమాతోనే వారు ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఆ ముగ్గురు హీరోలు ఎవరంటే.. అక్కినేని నాగచైతన్య, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ .. గురించి చెప్పుకోవాలి..!!
అక్కినేని నాగచైతన్య: నాగార్జున నట వారసుడుగా తెలుగులోకి అడుగుపెట్టిన నాగచైతన్య తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని మినిమం గ్యారెంటీ హీరోగా తెలుగులో స్థిరపడ్డాడు. చైతన్య రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అమీర్ ఖాన్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఇక నాగచైతన్య బాలివుడ్ లో తన తొలి సినిమాతోనే ప్లాఫ్ అందుకున్నాడు. అతని బాలీవుడ్ మీద ఆశలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి.
విజయ్ దేవరకొండ:పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో విజయ్ దేవరకొండ. తన రెండో సినిమా అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత విజయ్ నటించిన గీతాగోవిందం సినిమాతో మరో లెవల్ కి వెళ్ళాడు. తెలుగులో స్టార్ హీరోగా మారిన విజయ్ స్టార్ట్ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్ . ఈ సినిమాతో.. బాలీవుడ్ లో అదిరిపోయే హిట్ అందుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక లైగర్ సినిమా విజయ్ కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఆశలని మధ్యలోనే ఆగిపోయాయి.
సత్యదేవ్: ఇప్పుడు మరో తెలుగు యాక్టర్ బాలీవుడ్ లో తన లక్క్‌ని పరీక్షించుకుంటానికి సిద్ధమయ్యాడు.కాని తన ఆశలన్నీ తన మొదట సినిమాతోనే విఫలం అయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా రామ్ సేతు.. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో సత్యదేవ్ కూడా బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా నిన్న విడుదలై బాలీవుడ్ లో ఫ్లాప్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమా లో నటించిన సత్యదేవకు భారీ షాక్ ఇచ్చింది. ఇక దీంతో ఈ ముగ్గుర హీరోలు బాలీవుడ్ ఆశలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి.