ఇంట్రెస్టింగ్: జనవరి 11.. టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డే..!!

కొన్ని డేట్ లు భలే మ్యాజిక్ చేస్తాయి. టాలీవుడ్ కు కూడా సంబంధించి అలాంటి కొన్ని డేట్ లు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సంక్రాంతి సీజన్ జనవరి 11 కూడా ఒకటి.. ఆ రోజున విడుదలైన కొన్ని సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలుగా మిగిలిపోయాయి. జనవరి 11న వచ్చిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Vyjayanthi Movies on Twitter: "మా అగ్నిపర్వతం కి 36 వసంతాలు...... 36 Years  For Agni Parvatam. #SuperstarKrishna @Ragavendraraoba @AshwiniDuttCh  @VyjayanthiFilms https://t.co/2B7FIZebnq" / Twitter

ఇక 1985లో సూపర్ స్టార్ కృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా అగ్నిపర్వతం. ఈ సినిమాను ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా జనవరి 11న సంక్రాంతి సీజన్ లో విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా మిగిలిపోయింది. 1991లో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన సీతారామయ్యగారి మనవరాలు సినిమా కూడా జనవరి 11న విడుదలై అయింది. ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాతో నటి మీనా హీరోయిన్గా టాలీవుడ్ కి పరిచయమైంది.

Narasimha Naidu(నరసింహ నాయుడు) Telugu Full Movie | Balakrishna, Simran,  Preeti Jhangiani - YouTube

2001లో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాగా వచ్చిన నరసింహనాయుడు కూడా జనవరి 11న విడుదలైంది. ఈ సినిమా టాలీవుడ్ లోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా బాలకృష్ణ కెరియర్ లో వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది.

Seethamma Vakitlo Sirimalle Chettu - Disney+ Hotstar

అలాగే యువ హీరో రామ్ తొలి సినిమా దేవదాసు కూడా ఎలాంటి అంచనాలు లేకుండా జనవరి 11న విడుదలై రామ్ మొదటి సినిమాతోనే అదిరిపోయే హీట్ అందుకున్నాడు. ఈ సినిమాను వైవిఎస్ చౌదరి తెరకెక్కించాడు. వెంకటేష్- మహేష్ బాబు కలిసి నటించిన సినిమా సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు.. ఈ సినిమాతోనే ఈ తరం జనరేషన్ హీరోల మల్టీస్టారర్ సినిమాలు స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ జనవరి 11న విడద‌లై అదిరిపోయే హిట్ అందుకుని భారీ కలెక్షన్ వర్షంం కురిపించింది.

ఈ క్రమంలోనే చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయినా ఖైదీ నెంబర్ 150 కూడా జనవరి 11న రిలీజ్ అయింది. ఈ సినిమాతో చిరంజీవి తన స్టార్ డమ్ ను మళ్ళీ నిరూపించుకున్నాడు. రీ ఎంట్రీ తొలి సినిమాతోనే అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చే సంక్రాంతి కూడా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు వస్తున్నాయి. వాటిలో ప్రధానంగా చిరంజీవి- బాలకృష్ణ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటితోపాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్‌ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాల్లో ఏ సినిమా జనవరి 11 విడుదలై ఎంతటి సెన్సేష‌నల్‌ రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!