కాపురం నిలబెట్టుకోవడానికి ప్రగతి చేసిన పని తెలిస్తే కన్నీళ్ళాగవు..!

ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత స్టార్ హీరో, హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్ లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూకి హాజరయ్యి పలు విషయాలను వెల్లడించింది. వైవాహిక జీవితం నిలబడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరిపానని.. అయినా కుదరకపోవడంతో విడాకులు తీసుకున్నామని చెప్పింది. తన పిల్లలను ఎంతో కష్టపడి చదివించానని, వాళ్ళు ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చారని కూడా తెలిపింది ప్రగతి.

Tollywood Actress Pragathi Unseen Photos | Pragati Rare Photos Collection |  Tollywood Today - YouTube
భర్తతో విడాకులు అన్న సమయంలో ఆర్థిక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాగైనా సరే భర్తతోనే జీవితం గడపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. అందులో భాగంగానే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి నగలు కూడా తాకట్టు పెట్టుకొని ఆ రోజుల నుండి గట్టెక్కడం జరిగిందని తెలిపింది. జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు నాకు కూడా తోడు ఉంటే బాగుంటుందని అనిపించిందని చెప్పింది . కానీ జరిగిన దానిని తలుచుకుంటూ కూర్చుంటే అక్కడే ఉండి పోతామని కూడా వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ప్రగతి సినిమాలలో తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఈ టాలీవుడ్ నటీమణుల భర్తలు ఎం చేస్తారో తెలుసా..

కరోనా సమయంలో ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో వరుసగా జిమ్లో చేసిన విన్యాసాలను సోషల్ మీడియా వేదికగా.. వీడియో రూపంలో షేర్ చేస్తూ మరింతగా అగ్గిరాజేసింది. తన బ్యూటిఫుల్ , హాట్ ఫోటోలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు యువత మధ్యలోకి వెళ్లి తీన్మార్ స్టెప్పులు వేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ప్రగతి. ఇప్పటికీ కూడా ప్రగతి థియేటర్ స్క్రీన్ పై కనిపిస్తే .. యువత ఈలలు, చప్పట్లతో థియేటర్ మారుమ్రోగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.