పింగారా- కాంతారా సినిమాకు సంబంధం ఏంటి… ఈ రెండు సినిమాలు మధ్య తేడా ఇదే..!

ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా కాంతారా. చిన్న సినిమాగా కర్ణాటకలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్లు పైనే రాబట్టిన‌ ఈ సినిమా.. ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదలైంది. ఈ సినిమాను తెలుగులో రెండు కోట్లకు అల్లు అరవింద్ దక్కించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో ఇప్పటికే 20 కోట్లకు పైగా కలెక్షన్ రాబెట్టింది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ఎన్నో సెన్సేషనల్ రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది. కన్న‌డ నుంచి కేజిఎఫ్ సినిమా తర్వాత ఆ స్థాయిలో భారీ కలెక్షన్లు దక్కించుకున్న సినిమాగా కాంతారా రికార్డులు ఎక్కింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kantara Telugu 5 Days Collections!! : T2BLive

కాంతారా అంటే అసలు అర్థం అడివి.. అడవుల్లో ఉన్నఓ తెగ వారికి చెందిన ఆచారాన్ని ఈ సినిమాలో చూపించారు. వాటితో పాటు ఈ సినిమాలో కొంత కమర్షియల్ హంగుని కూడా అద్దాడు దర్శకుడు రిష‌బ్ శెట్టి. ఈ సినిమాలో హీరోగా కూడా రిష‌బ్ శెట్టి నటన ఎంతో అద్భుతంగా ఉంది. ఆయన నటనతో పాటు కథ కథనం ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇదే తరహా ఆహాలో గతంలో కన్నడలో ఓ సినిమా వచ్చింది అన్న విషయం చాలా మందికి తెలియదు.

The national award is dedicated to Tulu land, says Pingara director  Preetham Shetty | Kannada Movie News - Times of India

ఆ సినిమా పేరు ఏమిటంటే పింగారా.. ఈ సినిమాను కన్నడ మరియు తులు భాషల్లో రూపొందించారు. ఈ సినిమాలో బలహీన కులాల నిరసనకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి చూపించారు. ఇప్పుడు వచ్చిన కాంతారా సినిమాతో పోలిస్తే పింగారా సినిమాని చాలా నిజాయితీగా రూపొందించారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులను ఉన్నది ఉన్నట్టు ఎంతో రియలిస్టిక్ గా తీశారు. ఆ సినిమాలో కమర్షియల్ హంగులు లేని కారణంగా పింగారా సినిమాకు పెద్ద గుర్తింపు రాలేదు. ఈ సినిమా విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది.. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ సినిమా అవార్డు కూడా వచ్చింది. ఎన్నో ఫిలింఫెస్టివెల్‌కు కూడా ఈ సినిమా వెళ్ళింది.