అప్పుడే ఓటీటిలోకి వచ్చేస్తున్నా నాగార్జున ది ఘోస్ట్..!!

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కావడం జరిగింది.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. యాక్షన్ లవర్ లను మాత్రమే ఆకట్టుకోగలిగిన ఈ చిత్రం లో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ నటించింది. ఇక వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటి వేదికగా స్త్రిమ్మింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రిమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

The Ghost: ఓటీటీలో నాగార్జున 'ది ఘోస్ట్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఇక ఈ సినిమా ఓటిటి స్ట్రిమ్మింగ్ రిలీజ్ డేట్ కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ తెలియజేస్తోంది.ఈ చిత్రం నవంబర్ 2 నుంచి ఓటిటిలో అందుబాటులో కానునట్లు తెలియజేశారు. ఇక గతంలో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా కూడా థియేటర్లో మెప్పించలేకపోవడంతో ఓటీటి లో మాత్రం మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ది ఘోస్ట్ సినిమా కూడా అలాగే అలరించబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో విక్రమ్ అనే ఒక ఇంటర్ పోల్ అధికారిగా నాగార్జున కనిపించారు.

Official: OTT release date locked for Nagarjuna's The Ghost | 123telugu.com
ఆ సమయంలోనే తనకి ప్రియా అనే ఒక అమ్మాయి పరిచయమవుతుంది వీరిద్దరు దుబాయిలో పనిచేస్తూ ఉంటారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. అయితే ఒక ఆపరేషన్ లో భాగంగా రౌడీల చేతిలో ఒక చిన్న అబ్బాయి మరణిస్తాడు ఆ సంఘటన విక్రమ్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. దీంతో మానసికంగా కృంగిపోయి ఆ తర్వాత ప్రియ తన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఓటిటి లో చూడాల్సిందే.