ఆ స్థానాలని వదులుకున్న టీడీపీ..వైసీపీకి వన్‌సైడ్..!

రాజకీయంగా 175కి 175 స్థానాల్లో బలమైన నాయకులు ఉన్న పార్టీ ఏది అంటే..డౌట్ లేకుండా వైసీపీ అని చెప్పేయొచ్చు..ఆ పార్టీకు అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు ఉన్నారు. వైసీపీతో పోలిస్తే టీడీపీకి అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు లేరు. ఉండటానికి 175 స్థానాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ కొన్ని స్థానాల్లో టీడీపీకి బలమైన నాయకులు లేరు. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ ఇంకా పెరిగింది

ఇంకా చెప్పాలంటే కొన్ని స్థానాల్లో గెలవడంపై టీడీపీ ఫోకస్ చేయడం లేదనే చెప్పొచ్చు. ఆ స్థానాలని టీడీపీ లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. అసలు టీడీపీ ఆ సీట్లు వదిలేసుకుందని చెప్పొచ్చు..అక్కడ గెలుపుపై ఆశ కూడా పెట్టుకోవసరం లేదు. డౌట్ లేకుండా ఆ సీట్లు వైసీపీ ఖాతాలో పడటం సులువే.  అలాంటి సీట్లు నెల్లూరు, రాయలసీమ జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.

ముఖ్యంగా ఎస్సీ సీట్ల విషయంలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట, గూడూరు స్థానాలు ఎస్సీ రిజర్వడ్. ఈ స్థానాల్లో టీడీపీ పెద్దగా గెలిచిన సందర్భాలు లేవు. గత రెండు ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిచింది. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ లేదు..వ్యతిరేకత కనిపిస్తోంది. అలా అని ఈ రెండు చోట్ల టీడీపీకి పాజిటివ్ లేదు. ముఖ్యంగా సూళ్ళూరుపేట..ఈ సీటుని టీడీపీ లెక్కలో పెట్టుకోవడం అనవసరం.

ఇటు చిత్తూరులో..పూతలపట్టు, గంగాధర నెల్లూరు సీట్లు ఉన్నాయి..ఈ రెండు చోట్ల వైసీపీకి అద్భుతమైన ప్లస్ ఏమి లేదు. కానీ టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోవడమే..వైసీపీకి పెద్ద ప్లస్. ఈ రెండు సీట్లు కూడా టీడీపీ వదులుకోవడమే. కర్నూలులో..కోడుమూరు, నందికొట్కూరు సీట్లు ఉన్నాయి..వీటిల్లో కూడా సేమ్ సీన్ రిపీట్. కడపలో బద్వేల్, రైల్వేకోడూరు సీట్లు ఉన్నాయి. వీటిల్లో బద్వేల్ సీటుని టీడీపీ వదులుకున్నట్లే. సీమలోనే కాదు..కోస్తాలో కూడా ఇలా టీడీపీ వదులుకునే సీట్లు చాలానే ఉన్నాయి. యర్రగొండపాలెం, పామర్రు, తిరువూరు, చింతలపూడి, పాడేరు, అరకు, రంపచోడవరం లాంటి సీట్లపై టీడీపీ ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.