NBK-107 లో బాలకృష్ణ కూతురు నటిస్తుందా.. అద్దిరిపోయే ట్వీస్ట్..!

బాలకృష్ణ అంటే టాలీవుడ్ లో చాలామందికి భయం. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో.. ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదని అంటారు. దీనివల్లే ఆయన సినిమాలో చేయాలంటే తోటి నటీనట‌లు, సాంకేతిక నిపుణులు కాస్త భయపడుతూ ఉంటారు. మరికొందరు బాలకృష్ణను అర్థం చేసుకున్న వారు మాత్రం.. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని.. అయ‌న మనసులో ఏది ఉంచుకోడని.. ఏది కావాలన్నా ఎవరు తప్పు చేసినా వారి మొహం మీదే అనేస్తాడు.

NBK 107: Balakrishna's New Poster From This Untitled Movie Is Out On The  Occasion Of Senior NTR's 100th Birth Anniversary

ఆయనతో స్నేహం బంధుత్వం ఏర్పడితే.. మనం దాన్ని వదలాలి అనుకున్న వదల లేం. అదే విషయాని హీరోయిన్ వరలక్ష్మిశరత్ కుమార్ మరోసారి చెప్పుకువచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ తన107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే..ఈ సినిమా చెల్లెలు సెంటిమెంట్ కి దగ్గరగా ఉంటుందని.. ఇందులో బాలకృష్ణకు చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందని తెలుస్తుంది. ఈమె బాలకృష్ణతో మొదటిసారిగా నటిస్తుంది.

అయినా ఈమె బాలకృష్ణ తో ఆ స్పెషల్ బాండింగ్ బాగా ఆస్వాదిస్తుంది. సినిమా షూటింగ్ సమయంలో తన పాత్రకి తగ్గట్టు అన్నా అని పిలుస్తూ…. షూటింగ్ పూర్తయ్యాక చిన్నపిల్లలాగా డాడీ.. డాడీ అంటూ బాలయ్య వేలు పట్టుకుని తిరుగుతుందట. బాలకృష్ణ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ ని కూతురు లాగానే భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఇద్దరు ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం చేస్తారని..వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం.. సినిమాలో నటిస్తున్న వారంద‌రినీ ఆశ్చర్యపరుస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆమె ఆ సినిమాల్లో తన పని ఏంటో అది చూసుకుని.. ఎవరితోనో కలవకుండా ఉండేదట.. కానీ ఇప్పుడు బాలయ్యను మాత్రం ఒక్క క్షణం కూడా వదలకుండా ఉండలేకపోతుందట. వరలక్ష్మి శరత్ కుమార్‌కు బాలకృష్ణ ఏదో మంత్రం వేసారని షూటింగ్‌లో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరి బాండింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.