NBK- 107కి బాలయ్య సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా…!

బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. రవితేజకు క్రాక్ లాంటి సూపర్ హిట్ తరవాత గోపీచంద్ మల్లినేని డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది… ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల భామ శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు చెల్లిగా కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లో- టీజర్లు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా పేరు విషయంలో ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి.

ఈ సినిమాకు అన్నగారు, రెడ్డిగారు, వీర సింహారెడ్డి అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ఈ పేర్లే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు ఓ పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి వీర సింహారెడ్డి టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్ ఈరోజు రాత్రి 8:15 నిమిషాలకు కర్నూల్ లో రివిల్ చేయనున్నారు.

బాలకృష్ణకు సింహా ,రెడ్డి అనే టైటిల్స్ బాగా కలిసి వచ్చాయి.. బాలయ్య ఆ టైటిల్స్ లో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ వీర సింహారెడ్డి అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కూడా బాలయ్య కెరీర్ లో మరో సెన్సేషనల్ హీట్ అవుతుందని టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది.