పరిటాల-వంగవీటి కాంబో..సైకిల్‌కు మైలేజ్..!

ఏపీ రాజకీయాల్లో అటు పరిటాల ఫ్యామిలీ గురించి గాని, ఇటు వంగవీటి ఫ్యామిలీ గురించి గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు ఫ్యామిలీలకు రాష్ట్ర స్థాయిలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అనంతపురం రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ తిరుగులేని ముద్రవేసుకున్న విషయం తెలిసిందే. పరిటాల రవి అంటే ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అనేది చెప్పాల్సిన పని లేదు. అలాగే ఆయన ఎలా హత్య చేయిబడ్డారనేది తెలిసిందే. ఇక రవి వారసుడుగా ఇప్పుడు శ్రీరామ్..అనంతలో కీలక నాయకుడుగా ఉన్నారు.

గత ఎన్నికల్లో ఓడిపోయాక శ్రీరామ్ దూకుడుగా పనిచేస్తూ..నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇటు పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇక వంగవీటి ఫ్యామిలీ అంటే విజయవాడ..విజయవాడ అంటే వంగవీటి అన్నట్లు రాజకీయం జరిగేది. వంగవీటి రంగా వారసుడుగా రాధా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.

కాకపోతే రాధా కూడా రాజకీయంగా విఫలమవుతూ వస్తున్నారు. పలు పార్టీలు మారినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక గత ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి..ఆ పార్టీ కోసం పనిచేశారు. టీడీపీ ఓడిపోయాకా కాస్త రాజకీయాలకు దూరంగా ఉంటూ..తన తండ్రి ఆశయాలు కోసం పనిచేస్తున్నారు. అయితే ఆయన టీడీపీని వీడకుండా పార్టీలోనే ఉన్నారు. పరోక్షంగా ఆయన టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా వంగవీటి-పరిటాల ఫ్యామిలీలు టీడీపీ కోసం పనిచేస్తున్నాయి.

అయితే తాజా శ్రీరామ్-రాధా కలవడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అమరావతి పాదయాత్ర రాజమండ్రిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు యాత్రలో పాల్గొనున్నారు. అలాగే ఓ హోటల్‌లో ఇద్దరు నేతలు కలిశారు.   వీరితో పాటు దివంగత బాలయోగి వారసుడు హరీష్ ఉన్నారు. ఇలా వారసులు కలవడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి ఇద్దరు నేతలు కష్టపడుతున్నారని టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు కలవడం అనేది టీడీపీకి పెద్ద ప్లస్. మరి వీరు టీడీపీకి ఎంతవరకు మైలేజ్ పెంచుతారో చూడాలి.