గ్లింప్స్ తోనే అదరగొడుతున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ..!

టాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మని కీర్తి సురేష్ కంటే మహానటి అని పేరుతోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ ఈమె కెరియర్ ను ఇంకా కొనసాగేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబుతో సర్కారు వారి పాట చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో ఈమె తన హద్దులను చెరిపేసి నటించిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో ఇమే హీరోయిన్ గా నటిస్తున్నది.

Nani-Keerthy Suresh's Dasara goes on floors. See photos | Entertainment  News,The Indian Express

ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది.ముఖ్యంగా సింగరేణి గనుల నేపథ్యంలో కథ కావడంతో ఈ సినిమా పైన ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ ను, ఒక పాటను మాత్రమే విడుదల చేశారు. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను గ్లింప్స్ ను విడుదల చేయడం జరిగింది. ఇక తాజాగా చిత్ర బృందం అధికారికంగా ఒక ట్వీట్ ను పోస్ట్ చేయడం జరిగింది. బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన అనే క్యాప్షన్ తో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది.

చిన్న గ్లింప్స్ తోనే కీర్తి సురేష్ పాత్ర పైన చిత్ర బృందం ఆసక్తి రేపేలా చేసింది ఒక పల్లెటూరి అమ్మాయిల డి గ్లామరస్ పాత్రలో కీర్తి సురేష్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నట్లు ఈ వీడియోలో మనకి అర్థమవుతుంది. ఈ చిత్రం 2023 మార్చిలో విడుదల చేయడానికి చిత్తర బృందం పలు సన్న హాలు చేస్తున్నట్లు సమాచారం.

https://twitter.com/SLVCinemasOffl/status/1581623959392747520?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1581623959392747520%7Ctwgr%5E2fafda8193349685cae15a3ae25b620863ec7884%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Fdasara-movie-unit-relieving-keerthy-suresh-first-look-from-dasara-movie-au57-803129.html