బాబు స్కెచ్..పవన్ కోసం డమ్మీలు..!

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది..తాజాగా చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన విధానం బట్టి చూస్తే..నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలరు..లేదంటే వైసీపీదే మళ్ళీ పైచేయి అవుతుంది. అయితే పొత్తు దాదాపు ఫిక్స్ అయిన నేపథ్యంలో పలు సీట్లని టీడీపీ..జనసేన కోసం వదలాలి. అంటే కొందరు టీడీపీ ఇంచార్జ్‌లు త్యాగం చేయాలి.

అయితే ఇలా సీట్లు వదులుకునే విషయంలో ఇబ్బందులు రావొచ్చు అని ప్రచారం జరుగుతుంది. కానీ అనుకున్న మేర ఇబ్బందులు వచ్చేలా లేవు. ఎందుకంటే చంద్రబాబు ముందుగానే కొన్ని సీట్లలో డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. వారికే గ్యారెంటీగా సీట్లు ఇస్తామనే హామీ ఇవ్వలేదు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటు ఉంది…ఇక్కడ ఎంపీ కేశినేని నానిని సమన్వయకర్తగా పెట్టారు.

అంటే ఏ సీటు జనసేనకు కేటాయించిన ఇబ్బందులు రావు. అటు భీమవరం సీటులో తోట సీతారామలక్ష్మిని ఇంచార్జ్‌గా పెట్టారు. బాబు చెబితే ఆమె తప్పుకుంటారు..అలా నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు లాంటి సీట్లు ఉన్నాయి.

ఇక ఇటు తిరుపతి లాంటి సీటులో సుగుణమ్మ ఉన్నారు..కానీ ఆమెకు నెక్స్ట్ సీటు కష్టమే అని ముందే హింట్ ఇచ్చేశారు. అలాగే టీడీపీ ఇంచార్జ్‌లు సరిగ్గా పనిచేయని సీట్లని జనసేనకు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో సరిగ్గా పనిచేయని ఇంచార్జ్‌లు ఉన్నారు. అక్కడే జనసేనకు పట్టు ఉంది. కాబట్టి ఆ సీట్లు జనసేనకు కేటాయించే ఛాన్స్ కూడా ఉంది.

అంటే టీడీపీ నుంచి ఎక్కువ త్యాగాలు లేకుండానే జనసేనకు సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదో కొద్ది మంది మాత్రం అసలైన త్యాగం చేయాల్సి వస్తుంది. అంతే గాని..పూర్తి స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు త్యాగం అనేది ఉండదు.