పెళ్లి తర్వాత సునీత అందం రెట్టింపు.. ఇంతకీ ఇది ఎవరు అన్నారో తెలుసా?

టాలీవుడ్ స్టార్ సింగర్ లలో ఒకరైన సునీత.. తనదైన గాత్రంతో సంగీత ప్రేమికుల మనసు దోచుకుని పాపులర్ సింగర్ గా నిలిచింది. అంతేకాదు ఆమె పాడితేనే కాకుండా మాట్లాడుతున్న ఎంతో వినసొంపుగా ఉంటుందని డబ్బింగ్ లో కూడా తనకు సాటి ఎవరూ లేరని తన సత్తా చాటింది. అయితే ఈమె ఇప్పటివరకు 120 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారట.

గత ఏడాది సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది. ప్రస్తుతం సునీత తన దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ అలాగే కెరియర్ లో కూడా మంచి అవకాశాలతో రాణిస్తోంది. తాజాగా సునీత ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయ‌గా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో సునీత చాలా అందంగా హుందాగా కనిపించింది. సునీత పోస్ట్ కు ఎమోజీలను రియాక్షన్ గా ఇస్తూ నేటిజెన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

ఒక్క నెటిజన్ అయితే ఏకంగా రెండో పెళ్లి తర్వాత సునీత మరింత అందంగా కనిపిస్తున్నారని.. హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని కామెంట్ చేశారు. హీరోయిన్లు కూడా అసూయ పడే అంత అందంగా సునీత ఉన్నారని.. సునీతని చూస్తే అందం కూడా సిగ్గు పడుతుందని మరికొందరు నేటిజన్లు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. సునీతకు సోషల్ మీడియాలో ఫాన్స్ ఫాలోయింగ్ అంచెలంచెలుగా పెరగడం గమనార్హం. అయితే సునీత ఇప్పటివరకు పాడిన పాటలతో అలాగే తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వారికి మరింత దగ్గరయింది. అయితే సింగర్ సునీత తనపై వచ్చే నెగటివ్ కామెంట్లను ఏమాత్రం పట్టించుకునేది కాదట కానీ తన భర్త రామ్ గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం సునీత వారిపై ఘాటుగా రియాక్ట్ అవుతుందట. ఏదేమైనాప్పటికీ సునీతకు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతుంది.