క్లాస్ పీకినా..ఆ వారసుడు మారలేదే..!

ఈ మధ్య జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పనిచేయని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. గడపగడపకు పెద్ద తిరగని ఎమ్మెల్యేలకు..క్లాస్ పీకి ఇకనుంచైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నానికి జగన్ క్లాస్ తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. పైగా తన బదులు తన వారసుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) గడపగడపకు వెళుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని, కిట్టు పోటీ చేస్తాడని పేర్ని, జగన్‌కు వివరించినట్లు తెలిసింది.

అప్పుడే పేర్నికి జగన్ కూడా కౌంటర్ ఇచ్చేశారు..మీ వారసుడుకే కాదు ఏ వారసుడుకు సీటు ఇవ్వనని, మళ్ళీ మీరే తనతో పనిచేయాలని, అలాగా గడపగడపకు వారసులు తిరిగితే కౌంట్ చేయనని, ఎమ్మెల్యేలే తిరగాలని చెప్పినట్లు అప్పుడే ప్రచారం జరిగింది. అయితే జగన్ వార్నింగ్ తర్వాత వారసులు తిరగకుండా, ఎమ్మెల్యేలు ఏమన్నా ప్రజల్లోకి వెళుతున్నారా? అంటే ఆ విషయంలో పెద్ద మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు.

ఎందుకంటే మచిలీపట్నం నియోజకవర్గంలో ఇంకా పేర్ని వారసుడు కిట్టునే ప్రజల్లో తిరుగుతున్నారు. గడపగడపకు కిట్టునే వెళుతున్నారు. అయితే తన వారసుడుకు ఎలాగైనా సీటు తెచ్చుకుంటాననే కాన్ఫిడెన్స్‌తో పేర్ని..తన వారసుడుని ప్రజల్లో తిప్పుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన దగ్గర నుంచి మచిలీపట్నం బాధ్యతలని కిట్టునే చూసుకుంటున్నారు. ఆయనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ఆ మధ్య కొడాలి నాని సైతం..ఈ సారి బందరులో పేర్ని వారసుడు కిట్టు పోటీ చేస్తారని చెప్పేశారు. కానీ జగన్ మాత్రం ఏ వారసుడుకు సీటు ఇవ్వనున్నారు. అయినా సరే కిట్టునే జనంలో ఉంటున్నారు. అంటే చివరిలో జగన్‌ని ఒప్పించి తన వారసుడుకు సీటు తెచ్చుకోవాలని పేర్ని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి పేర్ని వారసుడుకు సీటు దక్కుతుందో లేదో.