ఆ హాట్ భామ ఆస్ట్రేలియాకు… ఆ స్టార్ క్రికెటర్ కోసం వెళ్ళిందా..!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళటం ఇటు ఉంచితే ఆమె ఆస్ట్రేలియా వెళ్లినందుకు అటు బాలీవుడ్ లో ఇటు భారత క్రికెట్ జట్టులోనూ తీవ్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె టీమిండియా వికెట్ కీపర్ బాట్స్మన్ రిషభ్‌పంత్ లవర్ అని వార్తల్లోకి ఎక్కింది. ఆమె రిషభ్‌ పంత్ ని కలిసేందుకే ఆస్ట్రేలియా వెళ్లిందని చెబుతున్నారు. టి20 ప్రపంచ కప్ కోసంటీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ క్రమంలోనే అతనితో గడిపేందుకే ఊర్వశి ఆస్ట్రేలియా వెళ్లినట్టు సోషల్ మీడియాలో ఒక టాక్‌ నడుస్తుంది.

ఈ క్రమంలోని ఈమే సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు ఈ వార్తలని నిజమైన లాగా అనిపిస్తున్నాయి.. ఆమె పోస్టులో నా హృదయాన్ని అనుసరిస్తూ వచ్చా… అన్న క్యాప్షన్ తో విమానంలో ఉన్న తన ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో నెటిజెన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. అన్ని సముద్రాలు దాటి వెళ్ళింది పంత్ కోసమేనా? అని ఒక నెటిజన్ అంటుంటే.. పంత్ నీకోసం అక్కడ వేచి చూస్తున్నాడని మరొక నెటిజన్ కామెంట్లు చేస్తున్నారు.

Rishabh Pant blocks actress Urvashi Rautela as he 'didn't want to take  anything forward': Report | Cricket News

వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని గత నాలుగు సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలకు బలం చేకూరటానికి 2018లో ఈ జంట ఓ రెస్టారెంట్లో కనిపించారు. ఇక అప్పుటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారని వార్తలు కూడా వచ్చాయి. పంత్ ఇప్పటికీ ఊర్వశితో డేటింగ్ వార్తలు నిజం కాదని చెప్పలేదు. ఇప్పుడు ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియా వెళ్ళడంతో వీళ్ళిద్దరి టాపిక్ మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.