నాగ చైత‌న్య‌ లాగే సమంత మళ్ళీ ప్రేమలో పడిందా కొత్తగా? ఇద్దరికిద్దరూ సరిపోయారు!

అక్కినేని నాగ చైత‌న్య‌, సమంత విడాకుల వ్యవహారం తంతు ముగిసి సంవత్సరం కావస్తున్నా వారికి సంబంధించినటువంటి ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమధ్య నాగ చైతన్య ఓ వర్ధమాననటితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ అనే వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. ఆ విషయం మర్చిపోక ముందే ఇప్పుడు సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అవును, ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోబోతుంద‌ని ప్ర‌చారం జరుగుతోంది.

ఇక అసలు విషయానికొస్తే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఇషా పౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ ని ఆమె ఎక్కువగా ఆరాధిస్తుంది. రెగ్యులర్ గా ఆయన కార్యక్రమాలకు కూడా హాజరవుతుంది. విడాకులు తీసుకున్న సమయంలో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లకుండా అయన బోధనలు కాపాడాయని ఓ సందర్భంగా సమంత చెప్పింది. దాంతోపాటు సమంత‌ని రెండో పెళ్లి చేసుకోమని కూడా ఈ సద్గురు సూచించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెళ్లి విషయంలో తాను ఆసక్తిగా లేనని, కానీ తాను ఎంతగానో ఆరాధించే, గౌరవించే వ్యక్తి రెండో పెళ్లి గురించి సలహా ఇవ్వడంతో సమంత ఆలోచనలో పడ్డట్లుగా పుకార్లు వసున్నాయి.

ఇకపోతే సామ్ అభిమానులు మాత్రం ఈ మాటలను ఖండిస్తున్నారు. సమంతకి ప్రస్తుతానికి రెండో పెళ్లిని గురించిన ఆలోచన లేదని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదని చెప్తున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ టైం ప్రస్తుతం బాగానే వుంది. టాలీవుడ్.. కోలీవుడ్.. మోలీవుడ్.. బాలీవుడ్.. అనే తేడాలేకుండా వరుస అవకాశాలను చేజిక్కించుకొని ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఇక స‌మంత న‌టించిన శాకుంత‌లం చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించగా ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ దుహాన్ సింగ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.