ఇండియన్ మూవీ హిస్టరీలో.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్..!

రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు మల్టీ టాలెంటెడ్ హీరోస్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీ స్టారర్ పాన్ ఇండియా చిత్రం దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలో కూడా మంచి రెస్పాండ్ అందుకుంటుంది ఈ సినిమా. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల అద్భుతమైన నటన, రాజమౌళి మార్క్ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తెచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు పలు అంతర్జాతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుంది ఈ సినిమా.

తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషలలో విడుదలై మంచి రెస్పాండ్ అందుకున్న ఈ సినిమా జపాన్ భాషలో కూడా విడుదలై అక్కడ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని హాలీవుడ్లో పలు ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు కూడా. ఇదిలా ఉండగా ఇండియన్ మూవీ హిస్టరీలో ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ సాధించని అరుదైన ఘనత సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాకి హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా అవార్డు దక్కింది. ఇలా ఏ భారతీయ సినిమాకు ఇప్పటివరకు ఈ గుర్తింపు లభించలేదు.

ప్రపంచ ప్రఖ్యాత సినిమా మ్యాగజైన్ ఎంపైర్ ఇటీవల రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ ను సదరు మ్యాగజైన్లో ప్రత్యేక ఆర్టికల్ గా ప్రచురించారు. ఇలా ఈ మ్యాగజైన్లో చోటు దక్కించుకున్న అతి కొద్ది సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఒకటిగా అరుదైన గుర్తింపు సంపాదించుకోవడం గమనార్హం. ఏది ఏమైనా అటు రామ్ చరణ్ , ఇటు ఎన్టీఆర్ లతోపాటు రాజమౌళి క్రేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

https://twitter.com/empiremagazine/status/1584911179000020995?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1584911179000020995%7Ctwgr%5Effa9fbbb43ae9c2279a2ada7d049b5cac1a2b2f4%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Frrr-movie-director-rajamouli-special-interview-world-famous-magazine-empire-au57-810709.html