యూట్యూబ్‌లో బీభత్సమైన ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్న బుల్లితెర భామలు..!

ఒకప్పుడు బుల్లితెర, షార్ట్ ఫిలిమ్స్ లో మెరిసి ఇప్పుడు యూట్యూబ్‌ని దున్నేస్తున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో టాప్‌లో నిలుస్తున్న భామలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంకర్ లాస్య

యాంకర్ లాస్య గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసి అలరించింది. అయితే పెళ్లయిన తర్వాత యాంకర్‌గా చేయడం మానేసింది. కానీ యూట్యూబ్‌లో మాత్రం బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఈ క్యూట్ యాంకర్ ఛానల్ ‘లాస్య టాక్స్’కి 1.26 మిలియన్ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. Eew యూట్యూబ్ స్టార్‌ ఫుడ్, ట్రావెల్, మేకప్, బేబీ కేర్ టిప్స్, హెల్త్ టిప్స్ పై ఈ ముద్దుగుమ్మ వీడియోలు చేస్తుంటుంది.

జాహ్నవి దాశెట్టి

డైలీ లైఫ్ సిట్యుయేషన్లను ఫన్నీగా చూపించడంలో జాహ్నవి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. బొద్దుగా ఉంటూ ముద్దుగా మాట్లాడే ఈ తార కళ్యాణ వైభోగమే వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది. షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసింది. అయితే సిల్వర్ స్క్రీన్‌ ద్వారా అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ నటి యూట్యూబ్‌లో మాత్రం మస్తు పాపులర్ అయింది.

యాంకర్ శ్రీముఖి

గట్టి గట్టిగా అరిస్తూ అమాయకంగా మాట్లాడుతూ ఫుల్ ఎనర్జీ తో బెస్ట్ టీవీ యాంకర్‌గా నిలిచింది శ్రీముఖి. సినిమాల్లో కూడా ఈ తార మెరిసింది. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాలకు టీవీ షోలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ద్వారా టచ్‌లో ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ భామకు 7 లక్షల 49 వేల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. ప్రేమకేతన యూట్యూబ్ ఛానల్ వేదికగా ట్రావెల్ బ్లాక్స్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇతర పర్సనల్ వీడియోలు పెట్టుకుంటుంది.

హిమజ

అలానే హిమజ బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఈ బబ్లీ గర్ల్‌కి ఐదు లక్షలకు పైగానే యూట్యూబ్ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఇక యాంకర్ సుమ రెండు ఛానెల్స్ మెయింటైన్ చేస్తుండగా ఆ రెండిటికీ 5 లక్షల పైగానే స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఈ జాబితాలో శివ జ్యోతి, రోహిణి వంటి యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు.