అందంలోనే కాదు అందులో కూడా తగ్గేదేలే అంటున్న త్రిష.. క్రేజ్ మామూలుగా లేదుగా..?

చెన్నై చిన్నది త్రిష గురించి.. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ వన్నెతరగని అందంతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.. పదహారణాల పడుచు పిల్లలా కనిపించే ఈ చెన్నై చిన్నది ఏకంగా 23 సంవత్సరాలుగా హీరోయిన్గా అదే క్రేజ్ తో కొనసాగుతూ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే పదేళ్లలోనే ఫేడౌట్ అవుతూ ఉంటారు. కానీ త్రిష మాత్రం ఇంత క్రేజ్ దక్కించుకోవడం.. అందులో కూడా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ వస్తోంది.

ఇకపోతే మొన్నటి వరకు సరైన హిట్ లేక ఇబ్బంది పడిన త్రిష ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ ను మలుపు తిప్పుకుంది. కుందవై యువరాణి పాత్రలో తన అద్భుతమైన నటనతో మరోసారి తనదైన మార్క్ సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఈ సినిమా విజయంతో త్రిష మళ్లీ ట్రాక్ లోకి ఎక్కిందని చెప్పాలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతిలోకి ఏకంగా రెండు భారీ ప్రాజెక్టులు వచ్చినట్లు సమాచారం.. అందులో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దళపతి 67వ చిత్రంలో.. విజయ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గిల్లీ అనే సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.. అందుకే ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై అభిమానులలో మరింత అంచనాలు పెరిగాయి.

మరొక స్టార్ హీరో అజిత్ చిత్రంలో కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది త్రిష. అజిత్ 62వ సినిమాలో త్రిష ను హీరోయిన్ గా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. సరైన విజయాలు లేక తన కెరీర్ ముగిస్తుందనుకుంటున్న సమయంలోనే త్రిషకు ఇలాంటి భారీ అవకాశాలు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ రెండు చిత్రాలు త్రిష కెరియర్ ను ఎలా మలుపు తిప్పుతాయో తెలియాల్సి ఉంది. అందుకే ఈ ముద్దుగుమ్మ అందం విషయంలోనే కాదు ఆఫర్లు అందుకోవడంలో కూడా తగ్గేదేలే అంటోంది.