పెళ్లికాకుండా బిడ్డను కన్నా తప్పు లేదు.. జయబచ్చన్ ఆసక్తికర కామెంట్స్ వైరల్..!!

ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ప్రేమ అనే పేరుతో చేయకూడని పనులు చేస్తూ బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటుంది .మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు కూడా లవ్ అనే మోజులో పెళ్ళికి ముందే మ్యాటర్ ఫినిష్ చేస్తూ తీరా పెళ్లి అనే టైంకి చేతులు దులిపేసుకుంటూ అబార్షన్లు చేయించుకుంటూ ఎప్పటికప్పుడు నెట్టుంట ట్రోలింగ్ కి గురి అవుతున్నారు.

కాగా రీసెంట్గా ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్ గురించి బాలీవుడ్ సీనియర్ నటి జయాబచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు . పెళ్లికి ముందే రిలేషన్ షిప్ తప్పు కాదు అంటూ ఆమె అభిప్రాయపడ్డారు . దీంతో ఒక్కసారిగా జాతీయ మీడియాలో ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. జయబచ్చన్ మాట్లాడుతూ..” ఇప్పుడు నేను మాట్లాడే ఈ మాటలు కొందరు జనాలకి నచ్చకపోవచ్చు.. నాపై వ్యతిరేకం చూపించవచ్చు.. కానీ నేను మాట్లాడేది నిజం అని ప్రతి ఒక్కరికి తెలుసు. నేటి కాలం యువత ప్రేమ పేరుతో ఎలా ఆకర్షితులవుతున్నారు అందరికీ తెలిసిన విషయమే . ఇద్దరు వ్యక్తులు ప్రేమకు సంబంధించిన భౌతిక ఆకర్షణ కారణంగా బ్యాలెన్స్ తప్పుతున్నారు”.

Jaya Bachchan - Biography, Height & Life Story | Super Stars Bio

” నిజానికి పెళ్లికి ముందు శారీరక సంబంధం అనేది నేను తప్పు పట్టను . కానీ ఖచ్చితంగా అది ప్రేమతో కూడిన రిలేషన్ అయితేనే సమాజంలో మీకు ఒక గౌరవం ఉంటుంది. పెళ్లికి ముందు రొమాన్స్ చేయొచ్చు ..అది మీరు నిజమైన ప్రేమ అని భావిస్తేనే.. అలాంటి తప్పు చేయండి . ఈ సందర్భంగా నేను ఇదే విషయం చెప్పుతున్నాను నా మనవరాలు నవ్య నవేలి పెళ్లికి ముందే బిడ్డను కన్నా నేను తప్పు పట్టను . నాకు ఏ ప్రాబ్లం లేదు. నిజమైన ప్రేమ ఆమెకు దొరుకుతుంది అంటే హ్యాపీగా ఉంటుంది అంటే అదే చాలు . మరీ ముఖ్యంగా నేటి కాలం యువత రిలేషన్ షిప్ లో ఎక్కువ రోజులు మనవడు సాధించడం లేదు. ప్రస్తుత కాలంలో ఇద్దరి మధ్య ప్రేమ ఉండాల్సిన అవసరం చాలా ఉంది “అంటూ చెప్పుకొచ్చారు. దీంతో జయ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.