ఓ మై గాడ్: నిజంగానే నాగ చైతన్య అందుకు ఒప్పుకున్నాడా..? ఇదేం ట్వీస్ట్ రా సామీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నాన్న పేరు చెప్పుకొని హీరోగా ఎంటర్ అయిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జోష్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఈ నాగచైతన్య మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాలో నటించి ఇండస్ట్రీ లెక్కలను తిరగ రాశాడు . అంతేకాదు ఇక తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూహిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయ్యాడు.

కాగా సాఫీగా సాగిపోతున్న నాగచైతన్య లైఫ్ లో సమంత ఎంటర్ అయ్యి విధ్వంసం సృష్టించిందని అక్కినేని ఫ్యాన్స్ చెప్తున్నారు . సాఫీగా వెళ్ళిపోతున్న నాగచైతన్యను లవ్ అంటూ మాయ చేసి ప్రేమించి పెళ్లి చేసుకుని ఆయన లైఫ్ నాశనం చేసేసిందని ఇప్పటికి అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. పాపం సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య టైం అస్సలు బాలేదు . విడాకుల తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమా పర్లేదు అనిపించినా.. మిగతా రెండు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమా అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

బంగార్రాజు ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

ఈ క్రమంలోనే నాగచైతన్య తన ఆశలనీ నెక్స్ట్ సినిమాపై పెట్టుకున్నాడు . మనకు తెలిసిందే వెంకట్ ప్రభు డైరెక్షన్లో.. నాగచైతన్య తన తదుపరి సినిమాను చేయబోతున్నాడు . ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమై చివరి దశలో ఉంది . కాగా ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగచైతన్య.. కృతి శెట్టితో బెడ్ సీన్స్ చేయడానికి అంగీకరించినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఇప్పటివరకు నాగచైతన్య సమంత తో తప్పిస్తే వేరెవరితో కూడా అలాంటి సీన్స్ చేయలేదు . ఫస్ట్ టైం కృతి శెట్టితో చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అది కూడా డివర్స్ తర్వాత నాగచైతన్య ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకోవడం నిజంగా షాకింగ్ అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి చూడాలి ఈ విషయంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో..?