అలాంటివన్నీ విదిరాత గా భావిస్తానంటున్న సాయి పల్లవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి నటన గురించి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మలయాళ ముద్దుగుమ్మ అయినప్పటికీ కూడా సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. మొదట ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ అమ్మాయిగా ఈ సినిమాలో తన మాటలు, డాన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశాయి. ఇక ఈ సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది.

Sai Pallavi Killing Her Career?
తెలుగులో సాయి పల్లవి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఎదిగిపోయింది. యువ హీరోల సరసన నటిస్తూ మంచి విజయాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే గార్గి సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించి తెలుగు, తమిళ ప్రేక్షకులను బాగా అలరించింది. తాజాగా సాయి పల్లవి చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. చాలామంది హీరోయిన్స్ తాము వదులుకున్న సినిమాలు మంచి హిట్ అయితే అలాంటి అవకాశం మిస్ చేసుకున్నందుకు బాధపడతారా అంటు ప్రశ్న ఎదురుగా..?

What Happened To Sai Pallavi?
అందుకు సాయి పల్లవి మాట్లాడుతూ..మిస్ చేసుకున్న పాత్రలు గుర్తుచేసుకొని ఎప్పుడు నేను బాధపడను అలాంటి మంచి పాత్రలు మనకి రాసి పెట్టలేదు..ఇది విదిరాత అని మాత్రమే భావిస్తానని తప్ప..ఎప్పటికీ బాధపడనని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారుతూ ఉన్నాయి. సాయి పల్లవి తన నుండి ఏ సినిమా ప్రకటన కూడా వేలబడలేదు.