ఆదిత్య-369:రూ.1.50 కోట్లతో తెరకెక్కించగా ఎన్ని కోట్లు లాభమంటే..?

బాలకృష్ణ నటించిన ఆదిత్య -369 చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రం 1991 లో జులై 18న విడుదలై భారతీయ సిల్వర్ స్క్రీన్ పైన ఎప్పటికీ రానటువంటి కథతో ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలకృష్ణ లో ఉన్న మరొక కోణం ని బయటికి తీశారు సింగీతం శ్రీనివాసరావు. బాలకృష్ణ అటు కృష్ణ కుమారుడా, శ్రీకృష్ణదేవరాయలుగా రెండు పాత్రలలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

Watch Aditya 369 Movie Online for Free Anytime | Aditya 369 1991 - MX Player
ఆదిత్య 369 అనే నెంబర్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉన్నది.369 అంటే పాజిటివ్ అని అర్థం వస్తుంది. అందులో 3 అంటే మార్పు అని అర్థం. 6 అంటే కొత్త అని ఆరంభం. 9 అంటే విస్తరించడం అని అర్థం వస్తుందట. ఇక అంతే కాకుండా 369 అనే నెంబర్ గడియారంలో సరి సమానంగా ఉండే కాలాన్ని కూడా చూపిస్తుంది. ఈ చిత్రం తర్వాతే కోహినూరు వజ్రం గురించి ప్రతి ఒక్కరికి దాని విలువ గురించి తెలిసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరో తరుణ్ కూడా చైల్డ్ యాక్టర్ పాత్రలో నటించారు.

ఈ చిత్రంలోని సుత్తివేలు కామెడీ జంధ్యాల రాసినవే కావడం వల్ల బాగా పాపులర్ అయ్యాయి. ఈ చిత్రంలోని పాటలు ఇళయరాజా మ్యూజిక్, సిరివెన్నెల మ్యూజిక్ ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించాయి. ఇక ఈ చిత్రాన్ని అప్పట్లోనే రూ.1.50 కోట్లతో తెరకెక్కించగా ఈ చిత్రం చివరికి రూ.9 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ రికార్డు గా నిలిచింది.