సీనియర్ నటుడు ఆవేదన… ఆ తప్పు వలన సర్వం కోల్పోయి రోడ్డుమీదకు వచ్చేసాం?

అలనాటి నటుడు నరసింహారాజు గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో జానపద చిత్రాలకు పెట్టింది పేరు మన నరసింహారాజు. 70sలో అనేక జానపద సినిమాలలో నటించి, పల్లె జనాల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోయాడు నరసింహారాజు. ఇక ‘విఠలాచార్య’ అనే సినిమాతో కమర్షియల్ బ్రేక్ ని అందుకున్నారు. ఈ లిస్టులో జగన్మోహిని సినిమా కూడా వుంది. ఈ రెండు సినిమాలు టీవీలో ప్రసారం అయితే ఇప్పటికీ కన్నార్పకుండా చూస్తారు తెలుగు జనాలు.

ఇకపోతే అప్పట్లో సినిమాల మీద వున్న మక్కువతో నరసింహారాజు మద్రాస్ వెళ్లిపోయారు. అలా నీడలేని ఆడది వంటి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసారు. ఈయన పుట్టినూరు పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామం. ఈయన దాదాపుగా 110 సినిమాలలో నటించి మెప్పించారు. నీడలేని ఆడది సినిమాలో అవకాశం అతనికి అంత ఈజీగా దక్కలేదట. దానికోసం పెద్ద పోరాటమే చేశారట. ఇకపోతే సినిమాల్లో రూ. 5000 వస్తే రూ.10000 ఖర్చు చేయడం వల్లనే ఆస్తులను సంపాదించుకోలేదంటూ ఆయన తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపారు.

అలాగే అతని తండ్రి ఎన్నో దాన ధర్మాలు చేసేవారట. అందువలనే ఆస్తులన్నీ కొవ్వొత్తిలాగా కరిగిపోయాయని చెప్పుకొచ్చారు. దాంతో బ్రతకడానికి ఖర్చులకోసం సంపాదించడం మొదలుపెట్టానని ఈ సందర్భంగా తెలిపారు. ఇక అతను సంపాదించిన డబ్బు అంతా ఇంటి ఖర్చులకే అయిపోయేదట. అలాగే ఖర్చులు కూడా అతను ఎక్కువగా చేసేవారట. దాంతో ఆస్తి మొత్తం పోయింది అంటూ నరసింహారాజు ఒకింత ఆవేదన చెందారు. ఈ సందర్భంగా అతను కస్టపడి సంపాదించిన ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలని సూచించారు.