వైసీపీ ట్రాప్‌లో టీడీపీ..బీజేపీ అలెర్ట్..!

మరొకసారి వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడుతుందని బీజేపీ అలెర్ట్ చేస్తుంది..రైల్వే జోన్ విషయంలో వైసీపీ పన్నిన ట్రాప్‌లో టీడీపీ పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. తాజాగా విభజన హామీలకు సంబంధించి కేంద్ర అధికారులతో, రాష్ట్ర అధికారులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో రైల్వే జోన్ సాధ్యం కాదని..కేంద్రం చెప్పినట్లు కథనాలు వచ్చాయి. గత ఎన్నికల ముందే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

కానీ అది ఇంకా ఆచరణలోకి రాలేదు. తాజాగా విభజన సమస్యలపై సమావేశం జరిగిన సమయంలో రైల్వే జోన్ సాధ్యం కాదని కేంద్రం చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ అంశాన్ని టీడీపీ అనుకూల మీడియా బాగా హైలైట్ చేసింది. దీనిపై కేంద్రం నుంచి వెంటనే వివరణ వచ్చింది. అసలు రైల్వే జోన్ గురించి చర్చ జరగలేదని, జోన్ సాధ్యం కాదని ఎవరు చెప్పలేదని జీవీఎల్ చెప్పుకొచ్చారు. వైసీపీ ట్రాప్ లో టీడీపీ మరోసారి పడిందని, రైల్వే జోన్ విషయంలో పత్రికల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర క్యాబినెట్ రైల్వే జోన్‌కు ఓకే చేసిందని, ఆ నిర్ణయం మీదే కేంద్ర ఉందని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ విధంగా రైల్వే జోన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కానీ మిగతా హామీల విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే గతంలో బీజేపీతో టీడీపీ కలిసి ఉన్నప్పుడు..హోదా ఇవ్వలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని, కాబట్టి కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావాలని అప్పుడు వైసీపీ గట్టిగానే డిమాండ్ చేసింది.

ఎన్నికల ముందు చంద్రబాబు..బీజేపీ నుంచి బయటకొచ్చి ధర్మపోరాటాల పేరిట దీక్షలు చేశారు. చివరికి బయటకొచ్చి నష్టపోయారు. అప్పుడే మోదీ..టీడీపీ వైసీపీ ట్రాప్ లో పడిందని మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ అదే కామెంట్ వచ్చింది. ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీకి మళ్ళీ దెబ్బపడేలా ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకున్నా సరే..హామీలు నెరవేర్చని బీజేపీతో కలిస్తే టీడీపీకే నష్టం. ఎటు వచ్చిన టీడీపీకే నష్టం.