వైసీపీకి తిరుగులేని చోట టీడీపీ హవా!

వైసీపీ 2011లో ఆవిర్భావించిన విషయం తెలిసిందే…ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సాధారణ ఎన్నికలు జరిగాయి..అలాగే కొన్ని ఉపఎన్నికలు జరిగాయి. 2012 ఉపఎన్నికలు, 2014, 2019 ఎన్నికలు…ఇలా ఏ ఎన్నికలు చూసుకున్న వైసీపీకి ఓటమి రాని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెస్ హవా, ఇప్పుడు వైసీపీ ఆధిక్యం నడుస్తోంది. అలా వైసీపీ హవా నడుస్తున్న కొన్ని స్థానాల్లో ఇప్పుడు సీన్ మారుతూ వస్తుందని సర్వేల్లో తేలుతుంది.

పూర్తి స్థాయిలో కాకపోయిన…కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది. వైసీపీ డామినేషన్ ఉన్నచోట టీడీపీ సత్తా చాటవచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీకి తిరుగులేని స్థానాలుగా ఉన్న నియోజకవర్గాలు దాదాపు 50 వరకు ఉన్నాయి…వాటిలో  కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరుగుతుంది..అలా టీడీపీకి బలం పెరుగుతున్న స్థానాలు వచ్చి పాతపట్నం, రాజాం, పాడేరు, కురుపాం, కొత్తపేట, జగ్గంపేట, రంపచోడవరం, పామర్రు, మంగళగిరి, బాపట్ల, మాచర్ల, గుంటూరు ఈస్ట్,  సంతనూతలపాడు, మార్కాపురం, నెల్లూరు సిటీ, పీలేరు, పలమనేరు, నగరి, కదిరి, మైదుకూరు, మంత్రాలయం, ఆలూరు, డోన్, కర్నూలు సిటీ స్థానాలు ఉన్నాయి.

ఈ స్థానాల్లో వైసీపీ హవా నడుస్తూనే ఉంది…2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఈ స్థానాల్లో వైసీపీ విజయాలు సాధిస్తూ వచ్చింది. అలాంటి స్థానాల్లో టీడీపీ పికప్ అయింది. అయితే ఈ స్థానాల అన్నిటిలోనూ టీడీపీ గెలుస్తుందని చెప్పలేం గాని…ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఈ స్థానాల్లో టీడీపీ బలం మాత్రం ఖచ్చితంగా పెరిగింది…ఇందులో కొన్ని స్థానాలని టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది…ఈలోపు వైసీపీపై ఇంకా వ్యతిరేకత పెరిగి…టీడీపీ ఇంకా పుంజుకుంటే ఈ స్థానాలని టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని వైసీపీ హవా ఉన్న స్థానాల్లో టీడీపీ సత్తా చాటే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు.