ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ..!!

స్వర్గీయ నందమూరి తారక రామారావు, రాజనాల కాలం నుంచే రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంబంధం మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు బిజెపి అగ్ర నేత హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతుండడం చాలా ఆసక్తికరంగా మారింది.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి ,కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అమిత్ సమక్షంలో బిజెపిలో చేరబోతున్నారు. ఈ క్రమంలోనే సభ ఏర్పాటు చేయగా ఆ సభలో పాల్గొనడానికి అమిత్ షా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది.Home Minister Amit Shah BJP National Working Committee Meeting says family  politics End IV news | irshi Videos

ఇక్కడి నుంచి మునుగోడు వెళ్లబోతున్నారు అమిత్ షా. అంతేకాదు మునుగోడు సభ పూర్తి అయిన వెంటనే అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని వార్తలు ప్రస్తుతం బయటకు రావడంతో దీని మీద పెద్ద ఎత్తున చర్చలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ అవడం చూసి ప్రతి ఒక్కరు రాజకీయాలకు సంబంధించి చర్చించడానికి భేటీ అవ్వబోతున్నారా అనే విషయం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది . కానీ ఇది రాజకీయాలకు సంబంధించిన మీటింగ్ కాదు అని ఇటీవల అమిత్ షా ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశారు అని, ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి.. తనతో పాటు భోజనం చేయాలని ఆయన ఆహ్వానించారని ఇందులో రాజకీయాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు.Jr NTR- Amit Shah: అమిత్ షా తో జూ ఎన్టీఆర్ భేటీ ఫిక్స్.. ఏం జరుగుతోంది

అంతే కాదు సినిమా విషయంలో మాత్రమే అభినందించడం కోసం ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించుకుంటున్నారని ప్రచారం కూడా జరుగుతుంది . ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కూడా మరో హీరోగా అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఈ సినిమాకు కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు కూడా భారత దేశ ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వాన్ని అందించింది.