వావ్: మళ్లీనా..కాజల్ అభిమానులకు గుడ్ న్యూస్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..ముద్దుగా అభిమానులు టాలీవుడ్ చందమామ అని పిలుచుకుంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీని ఒకానొక టైం లో ఏలేసిన ఈ బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించినలక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మగధీర సినిమాతో తన కెరీర్లు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. మగధీర సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. బాలీవుడ్.. కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ బిగ్ బిగ్ స్టార్స్ కళ్ళల్లో పడుతూ మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రభాస్ చిరంజీవి ఇలాంటి బిగ్ స్టార్స్ తో కూడా కాజల్ అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకుంది.

5 Hot Photos of Kajal Aggarwal in Saree That Made Us Fall In Love With Her | IWMBuzz
కాగా కెరీర్ పీక్ టైమ్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్. రీసెంట్ గానే ఓ బాబుకు జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాజల్ చెప్పిన సూక్తులు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. కాగా ప్రజెంట్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి . అయినా కానీ కాజల్ తన సెకండ్ కెరియర్ ని.. బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా గా.. రూపొందించుకోవడానికి ట్రై చేసింది . ఈ క్రమంలోనే కాజల్ కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకరైన బిగ్ ఫేమస్ డైరెక్టర్ ఒకరు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట.

సినిమాలో హీరోయిన్ గా కాదు కానీ సినిమాల్లో ఓ మెయిన్ క్యారెక్టర్ కోసం కాజల్ అగర్వాల్ ని సెలెక్ట్ చేసుకున్నారట. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా స్టోరీ విన్న కాజల్ అగర్వాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాల్లో యంగ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుందట. హీరో కూడా కొత్తవాడే. కానీ కథ మొత్తం కాజల్ అగర్వాల్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందట. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి మెయిన్ హీరో హీరోయిన్ అన్నీ కాజల్ నే. అందుకే తన సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ కు ఈ సినిమానే కరెక్ట్ అంటూ కాజల్ వెంటనే సైన్ చేసిన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ ప్రకటన రానుంది . ఆల్రెడీ ఇదివరకే కాజల్ మంచు విష్ణు కి అక్కగా ఓ సినిమాలో నటించింది. మళ్ళీ ఈ సినిమాలో హీరోకి అక్కగా నటించడానికి ఒప్పుకొని కాజల్ సంచలనానికి తెరతీసింది.