చిరంజీవి బర్త్‌డే పార్టీకి వెళ్లడం బన్నీకి ఇష్టం లేదా.. అందుకే న్యూయార్క్ వెళ్లిపోయాడా..?

ఏదో ఒక సినిమా ఫంక్షన్‌కి అల్లు అర్జున్ రావడం.. అప్పుడే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ మెగా అభిమానుల అరిచి గోల చేయడం ఇప్పటికే చాలా సార్లు జరిగింది. అయినా కూడా బన్నీ పవన్ కళ్యాణ్ పేరును “చెప్పను బ్రదర్” అని ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. దాంతో మెగా ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సరైనోడు సినిమా సమయం నుంచి ఇది కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీ పేరు ఉపయోగించుకుని స్టార్ట్ అయి ఇప్పుడు వారి పేరు చెప్పడానికి నీకెందుకు నామోషి? అన్నట్టు అతడిపై విరుచుకుపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వల్లే నీకు ఈ స్టార్డమ్‌ వచ్చింది అది గుర్తుపెట్టుకో!ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత వాళ్లని వెన్నుపోటు పొడవడం సరికాదు అని కూడా కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బన్నీ చేసిన ఒక పని మళ్లీ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తోంది.

రేపే (ఆగస్టు 22) చిరంజీవి బర్త్‌ డే. ఈ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నారు. కుటుంబ సభ్యులు, చిరంజీవిని అభిమానించే ప్రతి ఒక్క హీరో ఈ పార్టీకి రానున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఏదో పొలిటికల్ బిజీ కారణంగా రాలేనని ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బన్నీ కూడా ఈ పార్టీని స్కిప్ చేసేసాడు. తన భార్య స్నేహ రెడ్డిని తీసుకొని న్యూయార్క్ చెక్కేసాడు. దీంతో అభిమానులు అల్లు అర్జున్‌కి మెగాస్టార్ పుట్టినరోజుకి రావడం ఇష్టంలేక న్యూయార్క్ వెళ్లిపోయాడని, ఇలా చేయడం ఏమీ బాగోలేదు అని ఫైర్ అవుతున్నారు. తనకి మెగాస్టార్ ఫ్యామిలీకి ఏ సంబంధమూ లేదని, తాను అసలు మెగా హీరోనే కాదని అభిమానులకు అర్థమయ్యేలా చెప్పాలనే అతను పార్టీ స్కిప్ చేశాడంటున్నారు.

ఈసారి మెగాస్టార్ పుట్టినరోజును కార్నివాల్ ఫెస్టివల్‌గా హైటెక్స్‌లో జరపనున్నారు. దీనిని ఫ్యాన్స్‌కి ఒక మెమొరుబల్ డేగా మార్చాలని అనుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా చిరు పుట్టినరోజు జరుపుకునే విధంగా దీనిని ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పార్టీ వదిలేసి బన్నీ ఫారెన్ వెళ్ళిపోయాడు అంటే.. దానికి కారణం చిరంజీవిపై తనకు ఇష్టం లేదని మెగా అభిమానులు బన్నీ చెప్పాలనుకోవడమేనని గుసగుసలు వినపడుతున్నాయి.