గంటా సీటు జనసేనకే ఫిక్స్?

అవసరానికి తగ్గట్టు రాజకీయం చేయడంలో గంటా శ్రీనివాసరావుని మించిన వారు లేరనే చెప్పాలి..తనకు ఎప్పుడు విజయాలు దక్కేలాగానే గంటా రాజకీయం నడుపుతుంటారు. అలాగే ఏమైనా రాజకీయంగా ఇబ్బందులు ఉంటే..సైలెంట్ గా ఉండటంలో గంటాని మించిన వారు లేరు. అయితే ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మారిన, నియోజకవర్గాలు మార్చిన సరే..ఆయనకు విజయాలు దక్కాయి.

కానీ ఈ సారి గంటా పరిస్తితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది…ఈ సారి ఆయన ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు..కానీ టీడీపీలో పనిచేయడం లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో రాజకీయ పరిస్తితులని బట్టి ఆయన టీడీపీలో ఉండటం లేక వైసీపీలోకి వెళ్లిపోవడం చేస్తారు.  అప్పుడు టీడీపీ పరిస్తితి బాగుంటే..ఆ పార్టీలోనే ఉంటారు…లేదంటే జంప్ అయిపోతారు.

ఒకవేళ టీడీపీలో ఉన్నా సరే ఈయన మళ్ళీ విశాఖ నార్త్ సీటు నుంచి పోటీ చేయడం కష్టమని చెప్పొచ్చు…మళ్ళీ అక్కడ పోటీ చేస్తే గెలవడం కష్టం. అందుకే నియోజకవర్గానికి మార్చేయొచ్చు. అయితే గంటా రాజకీయం తెలిసి కూడా ఇంతవరకు నార్త్ లో టీడీపీ ఇంచార్జ్ ని పెట్టలేదు. ఇక దీనికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. నెక్స్ట్ జనసేనతో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు కేటాయించవచ్చని సమాచారం.

విశాఖ నగరంలో జనసేనకు బలం ఎక్కువగానే ఉంది…అయితే నగరంలో టీడీపీకి సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. కానీ నార్త్ లోనే గంటాతో డౌట్. అందుకే ఈ సీటు జనసేనకు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో గంటా ఇక్కడ 2 వేల ఓట్ల తో గెలిచారు..అలాగే జనసేనకు 20 వేల ఓట్లు వరకు పడ్డాయి.

అంటే ఈ సీటులో జనసేనకు పట్టు ఉంది…పొత్తు ఉంటే ఆ పార్టీకే సీటు ఇవ్వొచ్చు. ఒకవేళ బీజేపీ కూడా కలిస్తే…ఈ సీటు బీజేపీకి దక్కే అవకాశాలు కూడా లేకపోలేదు. 2014లో ఈ సీటు బీజేపీ దక్కింది..అలాగే గెలిచింది. మొత్తానికైతే విశాఖ నార్త్ సీటులో టీడీపీ పోటీ చేసే ఛాన్స్ లేదు..అటు గంటా కూడా పోటీ చేయడం కష్టం.