‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసా?

దాదాపు ఓ సంవత్సరం గ్యాప్ త‌ర్వాత హీరో నితిన్ నుండి ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ అనే ఊర మాస్ సినిమా నిన్ననే థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా నితిన్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా మాస్ క‌థాంశంతో తెరకెక్కడం విశేషమనే చెప్పుకోవాలి. కాగా ఈ సినిమాకు MS రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వ బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ సినిమాపైన నితిన్ చాలా న‌మ్మ‌కం పెట్టుకోగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న వసూళ్ల విషయానికొస్తే తెలంగాణ‌, APలో కలిపి ఈ సినిమా 7 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టింది. మిక్స్‌డ్ టాక్ ఉన్నా డీసెంట్ క‌లెక్ష‌న్స్ రావడం గమనార్హం.

ముఖ్యంగా మ‌ల్టీప్లెక్స్‌ల‌తో పోలిస్తే B, C థియేట‌ర్ల‌లో ఈ సినిమా వ‌సూళ్లు నిల‌క‌డ‌గా వున్నాయి. దాంతో ఏడు కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఇక అత్య‌ధికంగా నైజాంలో 1.42 కోట్ల వ‌సూళ్ల‌ను ఈ సినిమా రాబ‌ట్టింది. సీడెడ్‌లో 75 లక్షలు, గుంటూర్ లో 56 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర‌లో 68 ల‌క్ష‌లు, ఈస్ట్ లో 46 ల‌క్ష‌లు, వెస్ట్ లో 19 ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక కృష్ణ‌ 30 ల‌క్ష‌లు, నెల్లూర్‌లో 26 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ రావడం కొసమెరుపు.

మొత్తంగా తొలిరోజు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా 7.05 కోట్ల గ్రాస్‌, 4.26 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే… 19 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’ నాలుగో వంతు పెట్టుబడి రాబట్టేసింది. ఈ శని, ఆదివారాలు ముగిస్తే మాచర్ల నియోజకవర్గం బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాని వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే ఈ రెండు రోజుల్లో ఈ మూవీ భవితవ్యం తేలనుంది. రమారమి మరో 12 కోట్లు గనుక ఈ సినిమా రాబట్టగలిగితే నిర్మాతలు సేఫ్ జోన్లో పడ్డట్టే. ఏదిఏమైనా నితిన్ కెరీర్ కి అయితే ఈ సినిమా అంత ఉపయోగపడనట్లే లెక్క!