ఆ నలుగురు మంత్రుల సీట్లు గల్లంతేనా?

నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దొరకవనే చెప్పాలి..సరిగ్గా పనిచేయకపోవడం, ప్రజల్లోకి వెళ్లకపోవడం లాంటి అంశాల వల్ల కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక అలాంటి వారికి సీటు ఇస్తే వైసీపీకి ఓటమి ఖాయం..అందుకే అలా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేశారు.

అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అలాంటి వారికి నెక్స్ట్ సీటు ఇస్తే ఓటమి ఖాయమని తాజాగా వచ్చిన పీకే టీం సర్వేలో తేలిందట. కాబట్టి వారిని సైడ్ చేయాలని జగన్ డిసైడ్ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సర్వేలో నలుగురు మంత్రులు కూడా ఉన్నారని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అందులో ముగ్గురు మంత్రులు గుంటూరు జిల్లాకు చెందినవారే కావడం విశేషం. వేమూరులో మేరుగు నాగార్జున, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, చిలకలూరిపేటలో విడదల రజినిలతో పాటు కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్‌లపై వ్యతిరేకత ఉందని టీడీపీ అనుకూల మీడియా కథనంలో వచ్చింది. అయితే వీరికి నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే వీరిలో నాగార్జున, అంబటిలు సీనియర్లు…అటు రజిని, ఉషశ్రీ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు. పైగా తక్కువ సమయంలోనే ఫాలోయింగ్ పెంచుకున్నవారు.

అలాంటివారికి సీట్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనం నిజమే అయితే…వారికి సీట్లు ఇవ్వడం కష్టమవుతుంది…అదే సమయంలో వారిని వేరే సీట్ల పోటీకి దింపితే బెటర్ అని చెప్పొచ్చు. వారి సీట్లు మారిస్తే కాస్త పరిస్తితులు బెటర్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పటికే అంబటిని సత్తెనపల్లి నుంచి అవనిగడ్డకు మార్చవచ్చని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో మంత్రులకు అవే సీట్లు ఇస్తారో లేక సీట్లు మారుస్తారో….లేదంటే ఏకంగా సీట్లు ఇవ్వరో.