ధూళిపాళ్ళకు ఆరో విక్టరీ?

ఒకే ఒక వేవ్..దెబ్బకు ఓటమి ఎరగని నేతలు కూడా ఓటమి పాలయ్యారు..అసలు తిరుగులేదు అనుకున్న నేతలకు ఓటమి అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలా తెలిసేలా జగన్ చేశారు…గత ఎన్నికల్లో ఓటమి అంటే తెలియని నేతలకు ఓటమి రుచి ఏంటో చూపించారు. కేవలం తన ఇమేజ్ తో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలని గెలిపించారు…బడా బడా టీడీపీ నేతలకు చెక్ పెట్టారు. అలా జగన్ చెక్ పెట్టిన టీడీపీ నేతల్లో ధూళిపాళ్ళ నరేంద్ర కూడా ఒకరని చెప్పొచ్చు.

ఈయనకు పొన్నూరు నియోజకవర్గంలో ఓటమి అంటే తెలియదు…1994 నుంచి వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. ఆఖరికి వైఎస్సార్ వేవ్ ఉన్న 2004, 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 1994 నుంచి 2014 వరకు వరుసగా అయిదుసార్లు గెలిచిన నరేంద్ర…ఆరోసారి కూడా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. కానీ నరేంద్ర ఆశలకు జగన్ బ్రేకులు వేశారు. తన తండ్రి వైఎస్సార్ హవాలో కూడా గెలిచిన ధూళిపాళ్ళకు ఓటమి అంటే ఏంటో చూపించారు.

2019 ఎన్నికల్లో అనూహ్యంగా నరేంద్ర చాలా తక్కువ మెజారిటీతో తొలిసారి ఓటమి పాలయ్యారు. అటు జగన్ వేవ్ లో కిలారు రోశయ్య తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా నరేంద్రకు ఓటమి ఎదురైంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా నరేంద్రని నిలువరించడం జగన్ ఇమేజ్ కు సాధ్యమవుతుందా? ఎమ్మెల్యే రోశయ్య మళ్ళీ పొన్నూరు బరిలో గెలవగలరా? అంటే అబ్బో ఈ సారి మాత్రం కష్టమే అని చెప్పాలి.

ఈ సారి జగన్ వేవ్ తగ్గుతుంది…పైగా ఎమ్మెల్యే రోశయ్యకు పెద్దగా పొన్నూరులో పాజిటివ్ కనిపించడం లేదు. అదే సమయంలో ధూళిపాళ్ళ వేగంగా పుంజుకుంటున్నారు….అలాగే ఆయన్ని జైలుకు పంపించడం కూడా ప్లస్ అవుతుంది..జైలుకు వెళ్లొచ్చిన తర్వాత నరేంద్రపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ పరిణామాలని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో పొన్నూరు బరిలో ధూళిపాళ్ళ ఆరో విజయం అందుకునేలా ఉన్నారు.