ఢిల్లీకి బాబు…కమలం కరుణిస్తుందా?

2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు బాగా జ్ఞానోదయం అయిందని చెప్పొచ్చు..అప్పటివరకు అధికారంలో ఉన్న చంద్రబాబు..తనకు తిరుగులేదని అనుకున్నారు…అందుకే కేంద్రంలో బలంగా ఉన్న ఎన్డీయే నుంచి బయటకొచ్చి..బీజేపీపై ఏ విధంగా పోరాటాలు చేశారో అందరికీ తెలిసిందే. అయితే అన్నివేళలా బాబు సక్సెస్ అయిపోవడం జరిగే పని కాదు…ఢిల్లీ నుంచి ఎదురించి హడావిడి చేసిన బాబుకు…2019 ఎన్నికల్లో చుక్కలు కనబడ్డాయి..చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

ఈ ఓటమి తర్వాత బీజేపీ అవసరం ఎంత ఉందో బాబుకు తెలిసొచ్చింది…అందుకే ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు…కానీ బీజేపీ మాత్రం…బాబుని దగ్గరకు రానివ్వడం లేదు..అయినా సరే బాబు ప్రయత్నాలు విరమించడం లేదు…ఏదొరకంగా రాష్ట్రంలో బీజేపీకి హెల్ప్ చేస్తూ…ఆ పార్టీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి పరోక్షంగా మద్ధతు ఇచ్చారు. బద్వేల్, ఆత్మకూరు ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా తమ ఓట్లు కొన్ని బీజేపీకి పడేలా చేశారు.

 

ఇక ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో మద్ధతు అడగకపోయినా..బాబు…బీజేపీకి సపోర్ట్ చేశారు. ఇలా బీజేపీకి దగ్గర అవ్వడానికే బాబు ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ బీజేపీ మాత్రం…బాబుకు దగ్గర చేసుకోవడానికి చూడటం లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ కు చెక్ పెట్టాలంటే బాబు…పవన్ అవసరం ఉంది…అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయిన…కేంద్రం సపోర్ట్ ఉండాలని భావిస్తున్నారు. అందుకే బీజేపీ పెద్దలని ప్రసన్నం చేసుకోవడానికి, పాత స్నేహాన్ని చిగురింప చేయడానికి బాబు గట్టిగా ట్రై చేస్తున్నారు.

ఇదే క్రమంలో బాబు…ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అయితే బీజేపీకి యాంటీగా ఉండే పార్టీలు ఈ సమావేశానికి వెళ్తాయో లేదో క్లారిటీ లేదు. కానీ బాబు మాత్రం బీజేపీకి దగ్గరవ్వడానికే మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఈ సారైనా బాబుని బీజేపీ కరుణిస్తుందేమో.