రాజకీయాల్లో వ్యూహాలు కామన్. ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేయడమే ఇప్పుడున్నరాజకీయం. ఎదుటి పార్టీని ఎంతగా కుంగదీస్తే.,. తాము అంతగా పైకి ఎదుగుతామని.. నాయకులు.. పార్టీలు కూడా భావిస్తున్నా యి. ఈ క్రమంలోనే రాజకీయంగా ఏపీ ఎప్పటికప్పుడు అట్టుడుకుతోంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీని గద్దె దింపే క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. విజయం దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే పనిచేస్తోంది. అయితే.. ఈ క్రమంలో వైసీపీ అనుసరిస్తున్న తాజా వ్యూహం.. ఆ పార్టీకి ఏమేరకు మేలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
విషయంలోకి వెళ్తే.. గత ఎన్నికల్లో 151 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను.. వైసీపీ కేవలం 24 స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకోలేక పోయింది. అయితే.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాల్లోనూ విజయం దక్కించుకోవాలని.. సీఎం జగన్ పార్టీ నాయకులకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిని చూసి ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని కూడా ఆయన చెబుతున్నారు. ఏమీ ఇవ్వనప్పుడు.. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనప్పుడు.. మనకు 151 సీట్లు ఇచ్చారని ఆయన చెబుతున్నారు.
ఇప్పుడు మూడేళ్ల కాలంలో అనేక పథకాలు అమలు చేశామని.. రాబోయే రెండేళ్ల కాలంలో ఇంకా అనేక కార్యక్రమాలు అమలు చేస్తామని.. సో.. మొత్తం 175 స్థానాలకు 175 ఎందుకు సాధించలేమనిఆయన చెబుతున్నారు. ఈక్రమంలో నాయకులను ఇంటింటికీ పంపిస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు గెలుచుకున్న 151 స్థానాలకు తోడు.. 24 నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక దృస్టిపెట్టారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు దక్కిన ఆ స్థానాలను కూడా తనవైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగా.. జగన్.. ఇప్పటికే.. ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరేసేలా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి దక్కిన గన్నవరం, చీరాల, గుంటూరు పశ్చిమ, విశాఖ దక్షిణ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్నారు. ఇక, జనసేన దక్కించుకున్న రాజోలు నియోజకవర్గాన్ని కూడా.. తనకు అనుకూలంగా మార్చుకున్నారు. మిగిలిన 19 నియోజకవర్గాలపై ఏదో ఒక విధంగా పట్టు సాధించాలనేది.. జగన్ పెట్టుకున్న సంకల్పంగా చెబుతున్నారు.
అయితే.. ఇంత వరకు జగన్ వ్యూహం బాగున్నా.. అసలు ఇప్పుడు దక్కిన 151 స్థానాలు సురక్షితమని.. మళ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తామే విజయం దక్కించుకుంటామనే ధీమానే పరిశీలకులు. మేధావులు కూడా తప్పుబడుతున్నారు. సగం నియోజకవర్గాల్లో నాయకులపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ నాయకులకు ప్రజలకు మధ్య చాలావ రకు అంతరం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఉన్న సీట్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే.. బెటర్ అని అంటున్నారు. నిజానికి ఇదే విషయం పీకే టీం చేసిన.. ఐప్యాక్ సర్వేలోనూ.. తేలింది.
ప్రస్తుతం ఉన్న 151 స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నించాలని.. సర్వే కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. మంత్రులుగా ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు.. ఎమ్మెల్యేలు.. ఇలా చాలా వరకు 70 స్థానాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు సర్వే స్పష్టం చేసింది. ఈ క్రమంలో వాటిని కాపాడుకుంటే.. బెటర్ అని తేల్చిచెప్పారు. అయితే.. వీటిపై .. జగన్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో తెలియదు కానీ.. ప్రతిపక్షాలకు చోటు లేకుండా చేయాలని చేస్తున్న రాజకీయం మాత్రం.. ఏమేరకు.. సక్సెస్ అవుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.