రాజంపేట నుంచి జ‌గ‌న్ పోటీ.. మారుతున్న వ్యూహాలు..!

మార్పు స‌హ‌జం. రాజ‌కీయాలు అయితే మ‌రింత‌గా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు వైసీపీలో నూ ఇలాంటి మార్పులే వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా త‌న సొంత గ‌డ్డ క‌డ‌ప‌లో వైసీపీ వ్యూహాల ను మార్చేందుకు సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్‌.. ఆ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించ‌నున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆయ న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న , దాదాపు అర్ధ శ‌తాబ్దానికిపైగా త‌మ కుటుంబానికి అండ‌గా ఉన్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న వ‌దిలేయ‌నున్నార‌నే చ‌ర్చ వైసీపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేస్తార‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధాన బ‌ల‌మైన కార‌ణం.. త‌న చిన్నాన్న వివేకా.. కుమార్తెను ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దింపుతార‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. వైసీపీకి, వైఎస్‌కుటుంబానికి కూడా అండ‌గా ఉన్న మ‌రో నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మ‌ల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని అంటున్నారు.

జ‌మ్మ‌ల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. త‌ర్వాత‌.. 2014 నుంచి 2019 వ‌ర‌కు కూడా వైసీపీ అధీనంలోనే ఉంది. ఇక్క‌డ‌.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా కూడా వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. ఎలాంటి నాయ‌కులు.. ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రు బ‌రిలో నిలిచినా.. కాంగ్రెస్ అనుకూల ఓటు బ్యాంకు అంతా కూడా.. వైసీపీకి ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో చ‌దిపిరాళ్ల‌ ఆదినారాయ‌ణ‌రెడ్డి వైసీపీ త‌ర‌ఫున గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి డాక్టర్ సుధీర్ విజ‌యంద‌క్కించుకున్నారు.

ఈ నేప‌థ్యంలోనే పులివెందుల‌ను వ‌దులుకుంటే.. జ‌గ‌న్ జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి దిగుతార‌ని అంటున్నారు. ఇక‌, ఇక్క‌డ ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం కూడా ఎక్కువ‌గానే ఉంది. ఇక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుని కుమారుడు పోటీలోకి దిగుతారని ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి కూడా ఆ సమయానికి వైసీపీకి మ‌ద్ద‌తిచ్చే ఛాన్స్ ఉంద‌ని టాక్‌. ఏకంగా జగనే పోటీకి దిగితే అక్కడ టీడీపీ కూడా తన ప్లాన్ మార్చడం ఖాయం. ఎన్ని ప్లాన్‌లు మారినా.. జ‌గ‌న్ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి.