స్టార్ హీరో భార్య కు ప్రభాస్ బిగ్ ఆఫర్..లెక్కలు మార్చేస్తున్నాడురోయ్ ..?

టాలీవుడ్ హీరో గా తన సినీ కెరీర్ ని ప్రారంభించిన రెబల్ స్టార్ హీరో ప్రభాస్..ఇప్పుడు ఎలాంటి పోజీషన్ లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నక్క తోఖ తొక్కిన్నట్లు రాజమౌళి కంట్లో పడి..ఛత్రపతి సినిమాలో ఆఫర్ అందుకుని..బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈయన..ఆ తరువాత కొన్నేళ్ళు తరువాత మళ్ళీ ఆయన కాంబోలో లేనే..”బాహుబలి” అంటూ రెండు పార్ట్లు గా మన ముందుకు వచ్చి ప్రభంజనం సృష్టించారు.

ఆ సినిమా రిజల్ట్ తో డైరెక్టర్ కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ, క్రేజ్ అందుకున్నాడు ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అంతేనా, సార్ రేంజే మారిపోయింది ఇప్పుడు. ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు కోట్లల్లో బడ్జెట్ ఉంటుంది. ఈయన సీనిమాలు అన్ని పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కుతున్నాయి అంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు . ప్రజెంట్ బడా సినిమాలకు కమిట్ అయి బిజీ గా ఉన్న ప్రభాస్ తదుపరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది.

యస్.. సందీప్ వంగా తో ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశాడు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా కాలమే అయినా..ఇంకా హీరోయిన్ ని మాత్రం ఫిక్స్ చేయలేదు. కాగా, తాజాగా ఈ సినిమా లో హీరోయిన్ గా ఓ స్టార్ హీరో భార్య కు ఛాన్స్ ఇచ్చిన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆమె మరెవరో కాదు..బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్. యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ భామను స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారట మేకర్స్. నార్త్ మార్కెట్‌ని టార్గెట్‌గా చేసుకుని ప్రభాస్ బాలీవుడ్‌ భామలకు తన సినిమాలో అవకాశాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ k మూవీలో దీపిక తో రొమాన్స్ చేస్తున్నాడు ఈ హీరో. తాజాగా నెక్ట్స్ సినిమా కోసం మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ని రంగంలోకి దించుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం కరీనాకు రెగ్యులర్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ ఇస్తున్నారట నిర్మాతలు. మరి అంతలా ఈ సినిమాలో ఏం చూయించబోతుందో కరీనా..మనము చూద్దాం..?