నా భార్య రమ్య చాలా మంచిది.. గొప్ప మనిషి.. షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన నరేష్ ..!!

గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా, టెలివిజన్ ఎక్కడ చూసిన ఒక్కటే అంశం హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. అదే సీనియర్ యాక్టర్ నరేష్ నాలుగో పెళ్ళి. ఇప్పటి వరకు దీని పై అఫిషీయల్ ప్రకటన రాకపోయినా..బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం కొందరు సినీ స్టార్స్ నరేష్ కు సపోర్ట్ చేస్తూ…పొలిటికల్ పలుకుబడితో ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మీడియాలో ఎలాంటి వార్తలు వస్తున్నా ..నరేష్-పవిత్రల జంట..మాత్రం హ్యాపీగా బెంగుళూరులో ఓ హోటెల్ లో ఎంజాయ్ చేస్తుంది. సినిమా షూటింగ్ పనుల పై వాళ్ళు వెళ్లిన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ..అక్కడికి వెళ్లి చెప్పుతో కొట్టడానికి కూడా సిద్ధపడింది. అంత హీట్ పెంచేసింది వీళ్ల రిలేషన్ షిప్. అయితే, ఆ టైంలో నరేష్ వెక్కిలి చేష్టలు మాత్రం సామాన్య జనాలను కూడా రెచ్చకొట్టేలా ఉన్నాయి అంటూ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్రమంలో నరేష్ తన మూడో భార్య పై ఒకప్పుడు చేసిన కామెంట్స్ తాలుకా వీడియో ని వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. గతంలో ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చిన నరేష్..తన పరసనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ..” నా సినీ కెరీ స్టార్ట్ అయ్యింది 17 ఏళ్ళకే. 19 సంవత్సరాలకే పెళ్లి కూడా చేసేశారు. ఒకరకంగా ఇది బాల్య వివాహమే. కానీ, ఆమెకు హెల్త్ బాగోలేక డివర్స్ ఇచ్చేశాను. నా మూడో భార్య రమ్య చాలా చాలా మంచిది. గొప్ప వ్యక్తిత్త్వం ఉన్న మనిషి. నా ఐడియాలజీకి, ఆలోచనలకు సరిపోయే మనిషి.. మా ఫ్యామిలీలో చాలా తొందరగా అడ్జస్ట్ అయ్యింది..” అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. కానీ, ఇప్పుడు సీన్ కట్ చేస్తే..డ్రైవర్ తో అక్రమ సంబంధం అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా పరిస్థితులు మారిపోయాయి.. రమ్య రఘుపతి, నరేష్‌ల మధ్య అగాథం ఏర్పడడానికి కారణమైంది పవిత్ర లోకేష్ .