నేపోటిజాన్ని డైరెక్ట్ గానే వేలెత్తి చూపిన విజయ్ దేవర కొండ?

ఈ మధ్య వివిధ సినిమా పరిశ్రమలలో నెపోటిజమ్(బంధుప్రీతి) అనే మాట బాగా వినబడుతోంది. టాలెంట్ వున్న వాళ్లని కాకుండా ఆల్రెడీ సినిమా పరిశ్రమలో సెటిల్ అయిన కుటుంబాలనుండి వారసుల్ని, మనవల్ని, మునిమనవల్ని బలవంతంగా తీసుకువచ్చి ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్నారని ఓ వాదన గట్టిగా వినబడుతోంది. అయితే ఇది ఒక్క సినిమా రంగానికే అంటుకున్న జబ్బు కాదు. వివిధ రంగాలవారు ముందుగా వారివారి వారసుల్ని, బంధువులని మాత్రమే పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అందువలన నిజంగా టాలెంట్ వున్నవారికి అవకాశాలు లేకుండా పోతున్నాయి.

విజయ్ దీన్ని హైలెట్ చేశాడా?

అవుననే అంటున్నారు కొంతమంది మేధావులు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్. పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటనున్నాడు. ఈ మూవీ ఆగస్టు 25న 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ షురూ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో RTC క్రాస్ రోడ్స్ లోకి సుదర్శన్ 35 MM లో లైగర్ ట్రైలర్ ని విడుదల చేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ చాలా ఉద్వేగ భరితంగా మాట్లాడాడు.

ఇంతకీ ఏం మాట్లాడాడు?

విజయ్ మాట్లాడుతూ… “ఈ రోజు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీకు మా అయ్య తెలవదు.. మా తాత తెలవదు.. ఎవ్వరు తెలవదు. అలాగే నానుండి సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. ఆ ముందు రిలీజైనది పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు. మీరు చూపిస్తున్న ప్రేమని మాటల్లో ట్రై చేస్తా. ఐ లవ్ యూ. ఈ సినిమాని మీకు అంకితం చేస్తున్నా” అన్నాడు. దాంతో ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని పట్టుకొని కొంతమంది విజయ్ నేపోటిజం గూబమీద గుయ్యమనేలా కొట్టాడని అంటున్నారు. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి.