హీరో వరుణ్ తో యాక్షన్లోకి దిగిపోతున్న సమంత!

తెలుగు హీరోయిన్ సమంత రూత్ ప్రభు మంచి స్వింగ్ లో వుంది. అక్కినేని వారసుడితో విడాకుల అనంతరం సామ్ తనకు నచ్చినట్టు జీవిస్తోంది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా అమ్మడిని బాగా వరిస్తున్నాయి. తెలుగుతో పాటు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసేస్తోంది. అలాగే బాలీవుడ్లో డైరెక్ట్ గా సినిమాలకు సైన్ చేస్తోంది. ప్రస్తుతం యశోద మరియు శాకుంతలం సినిమాలను పూర్తి చేసిన సమంత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీ అయిపోయింది. ఇంకా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కు కూడా సమంత అక్కడ ఓకే చెప్పిందని సమాచారం.

వరుణ్ – సామ్ యాక్షన్ ఎపిసోడ్స్?

ఇకపోతే సామ్ ఇప్పటికే రాజ్ అండ్ DKల దర్శకత్వంలో వరుణ్ దావన్ తో కలిసి ఒక భారీ వెబ్ సిరీస్ లో నటించబోతున్న సంగతి తెల్సిందే. ఇది ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను మించి ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్ వెబ్ సిరీస్ కు ఇది రీమేక్ అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు చాలా రిస్కీ షాట్స్ ఉండబోతున్నాయట. దానికోసం వరుణ్ దావన్ మరియు సమంత లు ట్రైనింగ్ తీసుకోబోతున్నారని సమాచారం. ఒక హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ ఆధ్వర్యంలో వీరు ట్రైనింగ్ అవుతున్నారట.

మరింత సమాచారం:

ఇక ఈ ట్రైనింగ్ ఆగస్టు నెల మొత్తం నడుస్తుందని తెలుస్తోంది. ఇది పూర్తయ్యాక బ్యాక్ తో బ్యాక్ షూటింగ్ షెడ్యూల్స్ నిర్వహించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా యెంత పేరు గడిచిందో వేరే చెప్పనవసరం లేదు. బోల్డ్ గా నటించడం మాత్రమే కాకుండా చాలా కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించింది. ఇప్పుడు అంతకు మించిన యాక్షన్ ను చూపించేందుకు గాను హీరో వరుణ్ దావన్ తో కలిసి ఆ ట్రైనింగ్ లో జాయిన్ అవుతోంది.