థాంక్యూ కలెక్షన్స్: నష్టాలు వచ్చినా రాజు గారు సేఫ్.. బిజినెస్ స్ట్రాటజీ అంటే ఇలా ఉండాలి..!

తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు..భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన థాంక్యూ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. అలా ఇలా కాదు దారుణంగా ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా చూశాక మనం సినిమా తీసిన డైరెక్టర్ ఈయననేనా..అనే డౌట్లు కూడా వస్తున్నాయి . అంత చెత్త టాక్ సంపాదించుకుంది ఈ సినిమా. పాపం, ఈ సినిమా తో హిట్ కొట్టి..కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న..నాగ చైతన్యకి నిరాశే మిగిలింది. అయినా కానీ ఈ అక్కినేని కుర్రాడు చాలా స్ట్రాంగ్ ..ఫ్లాప్ బాధను బయటకు చెప్పకుండా మ్యానేజ్ చేస్తున్నాడు.

సినిమా కధలో బలం లేకపోవడం..చాలా సీన్స్ వేరే సినిమాలో చూసిన్నట్లు అనిపించడం..మెయిన్ డ్రా బ్యాక్ పాయింట్..అక్కినేని హీరోల రేంజ్ కధ కాకపోవడంతో..సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా దారుణం దెబ్బతిన్నాయి. నాగ చైతన్య కెరీర్ గ్రాఫ్ డౌన్ అయ్యేలా..ఉన్నాయి కలెక్షన్స్. మొత్తం మూడు రోజుల కలెక్షన్స్ చూసుకున్నా..10 కోట్లు కూడా దాటని పరిస్ధితి కనిపిస్తుంది. మొదటి రోజు 4.8 కోట్లు, రెండవ రోజు 3.5 కోట్లు కలెక్ట్ చేసి..బాక్స్ ఆఫిస్ దగ్గర చెత్త రికార్డ్ నెలకొల్పింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు.


అయితే, కొందరు సినిమా ప్రోడ్యూసర్ దిల్ రాజుని ట్రోల్ కూడా చేశారు. దిల్ రాజుకి భారీ బొక్క పడ్డిందని..ఈ మధ్య కాలంలో అన్ని ఫ్లాప్ లే కొడుతున్నాడు దిల్ రాజు అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, దిల్ రాజు బుర్ర చాలా తెలివైనది. సినిమా ఫ్లాప్ అయినా..లాభాలు రాకపోయినా..పెట్టిన డబ్బులు తిరిగి రప్పించుకునే సత్త ఉన్న ప్రోడ్యూసర్. ఈ సినిమా విషయంలోను అదే చేశాడు. మొత్తంగా 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ థాంక్యూ సినిమా దాదాపు థియేట్రికల్ గా 18 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు.

అయితే దిల్ రాజుకు 16 కోట్ల వరకు నష్టాలు కలిగినప్పటికీ..ఆయనకు ఉన్న స్పెషల్ టాలెంట్ తో.. కూడా వేరే రూట్లో ఆ డబ్బుని రికవరీ చేశాడు. అది ఎలా అంటే.. థాంక్యూ సినిమా ధియేటర్స్ ఫ్లాప్ అయినా కానీ.. ఓటిటి హక్కులను మ్మచి రేటుకే అమ్మేశాడత రాజుగారు. ఇక్కడ మరో ట్వీస్ట్ ఏమిటంటే.. థాంక్యూ సినిమాను రెండు ఓట్ట్ సంస్థలకు అమ్మేశాడట దిల్ రాజు. అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు sun NXT కూడా ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తంలో ఖర్చు చేసి దక్కించుకోవడంతో..సుమారు 10 కోట్ల వరకు రికవరీ చేశాడట. ఇక శాటిలైట్ డబ్బింగ్ రూపంలో కూడా మరొక ఎనిమిది కోట్ల వరకు వచ్చిన్నత్ళు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ లెక్కన చూసుకుంటే దిల్ రాజు పెట్టిన పెట్టుబడి ప్రతి రూపాయి ఆయనకు వచ్చేసిన్నట్లే.